సుచీ లీక్స్‌: అమల తప్పుకుందా, తీసేసారా?

సుచీ లీక్స్‌: అమల తప్పుకుందా, తీసేసారా?

అమలా పాల్‌ భర్తతో విడిపోవడానికి కారణాలేంటనేది అధికారికంగా తెలియకపోయినా, తమిళ నటుడు ధనుష్‌తో సాన్నిహిత్యమే దీనికి కారణమనే పుకారు బలంగా వుంది. ఈమధ్య సుచీ లీక్స్‌ వ్యవహారంలో కూడా ఈ జంట పేరు బాగా వినిపించింది.

విఐపి తర్వాత 'వాడ చెన్నయ్‌' చిత్రంలోను అమలా పాల్‌ని ధనుష్‌ కథానాయికగా తీసుకోవడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి. అయితే సడన్‌గా ఈ  చిత్రం నుంచి అమల వాకౌట్‌ చేసింది. ఆమె స్థానంలో మరో కథానాయిక కోసం చూస్తున్నారు. అమల సడన్‌గా ఈ ప్రాజెక్ట్‌నుంచి ఎందుకు తప్పుకుందనేది తెలీదు. డేట్స్‌ ఇష్యూస్‌ అంటున్నారు కానీ ఆమెకి మరీ డేట్స్‌ ఖాళీలేనన్ని ప్రాజెక్టులు చేతిలో లేవు.

వీరిద్దరి పేర్లతో జరుగుతోన్న రచ్చ దృష్టిలో వుంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని, అమల కూడా సానుకూలంగా స్పందించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుచీ లీక్స్‌ వ్యవహారం తర్వాత ధనుష్‌ కార్యకలాపాలపై రజనీకాంత్‌ ప్రత్యేకదృష్టి పెట్టారని, అతని ప్రాణ స్నేహితుడు అనిరుధ్‌తో కూడా ధనుష్‌ దూరంగా వుంటున్నాడని గాసిప్స్‌ వున్నాయి. మొత్తానికి సుచీ లీక్స్‌ రేపిన కలకలం తాలూకు ప్రకంపనలు ఇంకా కోలీవుడ్‌లో కనిపిస్తూనే వున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు