మెగా హీరోలు ముంచేశారు

మెగా హీరోలు ముంచేశారు

ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, మిగతా నటీనటులు, టెక్నీషియన్లు ఎవరైనా సరే.. వరుసగా రెండు మూడు ఫ్లాపులు ఎదురైనా తట్టుకోవచ్చు. మళ్లీ పుంజుకోవచ్చు. కానీ నిర్మాతకు వరుసగా రెండు మూడు దెబ్బలు తగిలితే అంతే సంగతులు. మిగతా వాళ్లకు జరిగేది వేరే నష్టం.

కానీ నిర్మాతలకు జరిగేది ఆర్థిక నష్టం కాబట్టి దాన్నుంచి కోలుకోవడం అంత వీజీ కాదు. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టిన వాళ్లు కూడా రెండు మూడు ఫ్లాపులు తినగానే అడ్రస్ లేకుండా పోతుంటారు. ఆ దెబ్బల నుంచి కోలుకోవడం అంత వీజీ కాదు. ఒక సినిమా నష్టాన్ని వెంటనే మరో సినిమా రికవర్ చేయకుంటే ఎలాంటి నిర్మాతకైనా ఇబ్బంది తప్పదు. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకడైన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) పరిస్థితి ఇలాగే ఉంది.

ఒకప్పుడు వరుస హిట్లు తీసి మధ్యలో డౌన్ అయిన బుజ్జికి కొన్నేళ్ల కిందట ‘రేసుగుర్రం’ గొప్ప ఊరటనిచ్చింది ఆ సినిమా అతడికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత మెగా హీరోల వల్లే అతడికి కోలుకోలేని దెబ్బలు తగిలాయి. వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ బుజ్జి తీసిన ‘ముకుంద’ నష్టాలే మిగిల్చింది. ఐతే అది మరీ ఎక్కువ నష్టమేమీ కాదు. తక్కువ బడ్జెట్లో సినిమాను ముగించడం వల్ల ఓ మోస్తరు నష్టంతో బయటపడ్డాడు బుజ్జి. కానీ ఈ ఏడాది ఒకటికి రెండు పెద్ద దెబ్బలే తగిలాయి బుజ్జికి. సాయిధరమ్ తేజ్‌తో తీసిన ‘విన్నర్’ సగానికి సగం నష్టాల పాలు చేసింది.

తాజాగా ‘మిస్టర్’ అన్నింటికీ మించి.. కిల్లర్ పంచ్ ఇచ్చింది బుజ్జికి. రూ.20 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాను తీస్తే.. పది కోట్లు రావడం కూడా కష్టంగా ఉంది. ఈ దెబ్బ నుంచి బుజ్జి కోలుకోవడం చాలా కష్టమయ్యేలాగే ఉంది. బుజ్జితో కలిసి ఈ సినిమాను నిర్మించిన ఠాగూర్ మధుకు మహేష్ మూవీ ‘స్పైడర్’లో భాగస్వామ్యం ఉంది కాబట్టి కొంత రికవర్ కావడానికి అవకాశముంది. కానీ బుజ్జి పరిస్థితే అయోమయంగా ఉందిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు