మహేష్‌కి భలే పిల్ల సెట్‌ అయింది

మహేష్‌కి భలే పిల్ల సెట్‌ అయింది

మహేష్‌ తదుపరి చిత్రంలో హీరోయిన్‌ ఎవరనే సస్పెన్స్‌కి తెర పడిపోయినట్టే. బాలీవుడ్‌ హీరోయిన్‌ కియా అద్వానీని కొరటాల శివ ఓకే చేసాడు. మొదట కీర్తి సురేష్‌ని అనుకున్నారు కానీ ఆమె కంటే కియారా బెటర్‌ ఆప్షన్‌ అని కొరటాల డిసైడ్‌ అయ్యాడట.

'ఎం.ఎస్‌.ధోని' చిత్రంతో బాలీవుడ్‌లో ఇన్‌స్టంట్‌ హిట్‌ అయిన ఈ సెక్సీ సుందరి మహేష్‌కి సరిజోడీలా వుంటుంది. స్టార్‌ హీరోయిన్లతోనే కాకుండా అడపాదడపా బాలీవుడ్‌ హీరోయిన్లని టాలీవుడ్‌కి మహేష్‌ పరిచయం చేస్తుంటాడు. ప్రీతిజింతా, సోనాలిబింద్రే, క్రితి సనన్‌, అమృతారావు, లీసారే, బిపాషా బసు తదితర బాలీవుడ్‌ హీరోయిన్లంతా మహేష్‌ చిత్రాలతోనే తెలుగు వారికి పరిచయమయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఇక్కడ సెటిల్‌ కాలేదనుకోండి.

మొత్తానికి మహేష్‌ సినిమాకి హీరోయిన్‌ పరంగా ఎదురైన మీమాంస తొలగిపోయింది కనుక ఈ చిత్రం మొదలవడమే ఆలస్యమన్నమాట. మహేష్‌ కోసమే కొరటాల ఎదురు చూస్తున్నాడు. అతను 'స్పైడర్‌' ఎప్పుడు ముగిస్తాడో అప్పుడు 'భరత్‌ అనే నేను' సెట్స్‌ పైకి వెళ్లిపోతుంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది ప్లాన్‌. ఆ ప్లాన్‌ వర్కవుట్‌ అవడానికి మే నెలాఖరునుంచి అయినా మహేష్‌ డేట్స్‌ దొరుకుతాయని కొరటాల చూస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు