దిల్‌ రాజు అయినా నాగ'బాబు'ని నిలబెడతాడా?

దిల్‌ రాజు అయినా నాగ'బాబు'ని నిలబెడతాడా?

అంగట్లో అన్నీ వున్నా అన్నట్టుగా అయిపోయింది వరుణ్‌ తేజ్‌ పరిస్థితి. హీరో కావడానికి కావాల్సిన అన్ని లక్షణాలతో పాటు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ వున్నప్పటికీ అతనికి ఏదీ కలిసి రావడం లేదు. పేరున్న దర్శకులతోనే పని చేస్తున్నా కానీ ఎవరూ వరుణ్‌కి హిట్టివ్వడం లేదు.

ఎలాంటి చిత్రాలు చేయాలనే కన్‌ఫ్యూజన్‌లో ముందుగా క్లాస్‌ సినిమాలతో మొదలు పెట్టిన వరుణ్‌ తర్వాత కమర్షియల్‌ బాట పట్టాడు కానీ పూరి, వైట్ల ఇద్దరూ అతనికి షాకిచ్చారు. దీంతో ఇప్పుడు వరుణ్‌ ఆశలన్నీ శేఖర్‌ కమ్ముల ఫిదాపైనే వున్నాయి. కమ్ముల ఈమధ్య కాలంలో చెప్పుకోతగ్గ ఫామ్‌లో లేడు. కాకపోతే ఈ కథని దిల్‌ రాజు ఓకే చేసాడు కనుక నమ్మకం పెట్టుకోవచ్చనే అనుకుంటున్నారు. నాగబాబు కూడా ఇప్పుడు పూర్తిగా దిల్‌ రాజు మీదే భరోసా వుంచాడు. అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా స్టాండ్‌ అయిపోవడంలో దిల్‌ రాజు పాత్ర కీలకం.

మరిప్పుడు మరో మెగా హీరోకీ దిల్‌ రాజే బ్రేకిస్తాడా? ఫిదా కథేంటో, అసలు ఎంత వరకు వచ్చిందో, ఎప్పుడు షూటింగ్‌ చేస్తున్నారనేది కూడా తెలీదు. జూన్‌ లేదా జులైలో విడుదలకి సిద్ధమవుతుందని అంటున్నారు. మరోసారి బ్లాక్‌బస్టర్‌ రాజుకి బాక్సాఫీస్‌ ఫిదా అవుతుందో లేదో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు