సునీల్‌ ఇప్పటికైనా దారికొచ్చాడా?

సునీల్‌ ఇప్పటికైనా దారికొచ్చాడా?

కామెడీ వేషాల నుంచి హీరోగా ఎదిగిన సునీల్‌ తనని సగటు హీరోలానే చూడండంటూ బేస్‌ వాయిస్‌తో యాక్షన్‌ హీరో చిన్నెలు మొదలుపెట్టాడు. సునీల్‌ సినిమాకి నవ్వుకుందామని వెళ్లిన జనాలు అతడి యాక్షన్‌ గిరీ చూడలేక తిప్పికొట్టారు. దాంతో మళ్లీ కామెడీ చేస్తానంటూ 'ఈడు గోల్డ్‌ ఎహె' చిత్రంలో ఏంటేంటో చేసినా మనస్ఫూర్తిగా నవ్వించడానికి ట్రై చేయడం లేదని, బలవంతంగా కామెడీ చేస్తున్నాడని అనిపించింది.

కృష్ణాష్టమి, ఈడు గోల్డ్‌ ఫ్లాప్స్‌తో సునీల్‌ ఇక కామెడీ చేయక తప్పదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో అతను ఉంగరాల రాంబాబు చేస్తున్నాడు. ఈ టైటిల్‌ వినడానికి కామెడీ సినిమాలానే అనిపిస్తోంది కానీ ఎంత కామెడీ వుంటుందనేది తెలీదు. పోస్టర్లు, ఫోటోలు మాత్రం పాటల స్టిల్సే రిలీజ్‌ చేస్తున్నారు. సునీల్‌ని కామెడీగా చూపించడానికి కాకుండా హీరోలా ప్రెజెంట్‌ చేయడానికే ఇంపార్టెన్స్‌ ఇచ్చినట్టు కనిపిస్తోంది. క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది.

సునీల్‌ ఇప్పటికైనా దారికొచ్చాడా, పూర్తి స్థాయి కామెడీ పాత్రలో కనిపిస్తున్నాడా అనేది సినిమా చూసాక కానీ చెప్పలేం. ఎన్నెన్నో హిట్‌ సినిమాలు చేసిన అల్లరి నరేష్‌ కూడా ప్రస్తుతం సక్సెస్‌ కోసం అలమటిస్తున్నాడు. కామెడీ సినిమాలతో జనాన్ని మెప్పించడం అంత తేలిక కాదని, ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వించాలని సునీల్‌ కూడా తెలుసుకోవాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు