పెళ్లిపై మళ్లీ షాకిచ్చిన ప్రభాస్

పెళ్లిపై మళ్లీ షాకిచ్చిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి చర్చ జరుగుతోంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు.. ఎప్పుడు మీడియాను కలిసినా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురవుతుంది. ఆయన ఇదిగో అదిగో అంటుంటారు. ‘బాహుబలి’ పూర్తవగానే కచ్చితంగా ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆయనన్నారు. ఐతే రెండేళ్లకు పూర్తవుతుందనుకున్న ‘బాహుబలి’ కాస్తా నాలుగేళ్లకు కానీ అవ్వలేదు.

ఐతే ఈ సినిమా పూర్తయ్యాకైనా పెళ్లి మాటెత్తుతాడనుకుంటే.. అదేమీ జరగట్లేదు. ప్రభాస్‌కు ఇప్పటికే 37 ఏళ్లు వచ్చేయడంతో అతను ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోతోంది. ‘బాహుబలి-2’ కూడా పూర్తి చేసి కొన్ని నెలలవుతున్నా.. ప్రభాస్ పెళ్లి మాటెత్తకుండా సైలెంటుగా సుజీత్ సినిమా మీదికి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది అందిరకీ.

తాజాగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే అతడిచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచన లేదని.. వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ప్లాన్స్ ఏమీ లేవని స్పష్టం చేశాడు ప్రభాస్. తన పెళ్లి వ్యవహారం పెదనాన్న కృష్ణం రాజు చూసుకుంటారని.. ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగిపోతుందని ప్రభాస్ వ్యాఖ్యానించాడు. మరి తన తమ్ముడి కొడుకు పెళ్లి విషయమై కృష్ణం రాజు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు