సింహాద్రి గురించి విజయేంద్ర చెప్పిన సీక్రెట్

సింహాద్రి గురించి విజయేంద్ర చెప్పిన సీక్రెట్

సింహాద్రి.. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులనూ చెరిపేసిందా సినిమా. 150కి పైగా సెంటర్లలో వంద రోజులాడి చరిత్ర సృష్టించిన చిత్రమది. ఈ సినిమాతో ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయాడు ఎన్టీఆర్.

ఐతే నిజానికి ఈ కథ అనుకున్నది ఎన్టీఆర్ కోసం కాదట. ఎన్టీఆర్ బాబాయి నందమూరి బాలకృష్ణను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాశారట. కానీ అనివార్య కారణాల వల్ల బాలయ్య ఆ సినిమాను చేయలేకపోయాడట. తర్వాత రాజమౌళి.. తన తొలి చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్ దగ్గరికి ఈ కథను తీసుకెళ్లాడట.

ఎన్టీఆర్ కోసం కథలో కొన్ని మార్పులు చేసి.. అతడి ఇమేజ్‌కు తగ్గట్లుగా తీర్చిదిద్దినట్లు విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. బాలయ్యతో ‘సింహాద్రి’ తీస్తే ఎలా ఉండేదో కానీ.. ఈ సినిమా దెబ్బకు ఎన్టీఆర్ కెరీరే మారిపోయింది. ఈ సినిమాకు కథ రాయడానికి తనకు స్ఫూర్తినిచ్చింది ‘వసంత కోకిల’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఆ సినిమాలో క్లైమాక్స్ చూసి ఎన్టీఆర్-భూమిక ఎపిసోడ్ రాశానని.. ఆ తర్వాత మిగతా కథను డెవలప్ చేశానని విజయేంద్ర ప్రసాద్ తెలిపాడు. రాజమౌళి అప్పటికే ‘స్టూడెంట్ నెంబర్ వన్’తో హిట్టు కొట్టినప్పటికీ.. ఆ క్రెడిట్ ఎక్కువగా రాఘవేంద్రరావుకే వెళ్లిపోయింది. జక్కన్న అంటే ఏంటో తెలిసింది.. ‘ఎన్ ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్’ అన్న ట్యాగ్ పడింది ‘సింహాద్రి’ సినిమాకే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు