వరుణ్ తేజ్.. మరో చైతు!

వరుణ్ తేజ్.. మరో చైతు!

ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడంటే.. అతడి తొలి సినిమా పక్కా కమర్షియల్ స్టయిల్లో ఉండేలా చూసుకుంటుంటారు. తొలి సినిమాతోనే ఆ హీరోకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చేలా అతణ్ని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. కథాంశం దగ్గర్నుంచి.. దర్శకుడి ఎంపిక వరకు అలాగే ఉంటుంది. ఐతే అక్కినేని లాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య విషయంలో మాత్రం ఇలా జరగలేదు.

అతడి తొలి సినిమా కానీ.. ఆ తర్వాత చేసిన సినిమాలు కానీ అతడికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టలేకపోయాయి. ‘జోష్’ క్లాస్ టచ్ ఉన్న సినిమా. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాతో చైతూకు క్లాస్ ఇమేజ్ వచ్చింది. దీని తర్వాత అతడికి తొలి విజయాన్నందించిన ‘ఏ మాయ చేసావే’ అతడికి మరింత క్లాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. దీంతో లవర్ బాయ్ ఇమేజ్‌తో కంటిన్యూ అయిపోయాడు చైతూ. మధ్యలో కొన్ని మాస్ సినిమాలు చేసినప్పటికీ అతడికి మాస్ ఇమేజ్ అయితే రాలేదు.

ఇప్పుడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కెరీర్ కూడా ఇలాగే సాగుతోంది. కుర్రాడు చూడటానికి మ్యాన్లీగా.. పెద్ద మాస్ హీరో అయ్యేలా కనిపించాడు కానీ.. వరుణ్ ఆరంభంలో చేసిన సినిమాలు అతడికి క్లాస్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ‘ముకుంద’, ‘కంచె’ పక్కా క్లాస్ సినిమాలు కావడంతో జనాలు అతణ్ని అలాంటి సినిమాల్లో చూడటానికే అలవాటు పడ్డారు. ఈ సినిమాలు కమర్షియల్‌గా ఎంత సక్సెస్ అయ్యాయి అనేది పక్కన పెడితే.. అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఇలాంటి టైంలో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేసి దెబ్బ తింటున్నాడు వరుణ్. అతను పక్కా మాస్ మసాలా క్యారెక్టర్ చేసిన ‘లోఫర్’ దారుణంగా బోల్తా కొట్టింది. తాజాగా ‘మిస్టర్’లోనూ మాస్ టచ్ ఉన్న క్యారెక్టరే చేశాడు. ఈ సినిమా కూడా అతడికి ఆశించిన ఫలితాన్నిచ్చేలా కనిపించడం లేదు. మొత్తంగా వరుణ్‌కు మాస్ సినిమాలు అంతగా కలిసొస్తున్నట్లు లేవు. తనకు కలిసొచ్చిన, మంచి పేరు తెచ్చిన క్లాస్ సినిమాలతోనే అతను కంటిన్యూ అయిపోతే బెటరనిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న ‘ఫిదా’ పక్కా క్లాస్ లవ్ స్టోరీనే. అది కనుక హిట్టయితే వరుణ్ కూడా ఆ తరహా సినిమాలకే పరిమితం అయిపోతాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు