వెరీ వీక్‌ ఓపెనింగ్‌ మిస్టర్‌

వెరీ వీక్‌ ఓపెనింగ్‌ మిస్టర్‌

హాలిడే రిలీజ్‌ దొరికినా, మార్కెట్లో మరేమీ సినిమాలు లేకపోయినా 'మిస్టర్‌' చిత్రానికి ఆశించిన ఓపెనింగ్‌ రాలేదు. సినిమా బాగుండడం, బాగోకపోవడం అటుంచి, శ్రీను వైట్ల బ్రాండ్‌ నేమ్‌, వరుణ్‌ తేజ్‌కి వున్న మెగా ఫాన్స్‌ ఫాలోయింగ్‌తో డీసెంట్‌ ఓపెనింగ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసారు.

కానీ మిస్టర్‌ మొదటి రోజునే డిజప్పాయింట్‌ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు కోట్ల పైచిలుకు షేర్‌తో మిస్టర్‌ బయ్యర్లని నిరాశపరిచింది. ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడికి, ఈ ఓపెనింగ్‌కి పొంతన లేదు. మరో బాధాకర అంశమేంటంటే ఈ చిత్రానికి టాక్‌ కూడా చాలా వీక్‌గా వుంది. దానికితోడు లారెన్స్‌ సినిమా 'శివలింగ' మాస్‌ని ఆకట్టుకుంటుందని అంటున్నారు. బాహుబలి వచ్చేవరకు అయినా మిస్టర్‌ సస్టెయిన్‌ అవుతుందని అనుకున్నారు కానీ అది జరిగేలా లేదు.

ఈ సోమవారం నుంచే ఈ చిత్రానికి గడ్డు పరిస్థితి ఎదురయ్యేట్టుంది. వరుసగా రెండు ఫ్లాపుల తర్వాత శ్రీను వైట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్న మిస్టర్‌ చిత్రాన్ని ప్రేక్షకులు అవుట్‌రైట్‌గా రిజెక్ట్‌ చేయడం అతడికి ఇబ్బందే. మరి ఈ దెబ్బ నుంచి కోలుకుని నెక్స్‌ట్‌ సినిమా ఎవరితో, ఎప్పుడు, ఎలాంటిది ప్లాన్‌ చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు