డైరెక్ష‌న్‌లోనూ ర‌జ‌నీ అల్లుడు కింగే!

డైరెక్ష‌న్‌లోనూ ర‌జ‌నీ అల్లుడు కింగే!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌లో మంచి న‌టుడే కాదండోయ్‌.. మంచి డైరెక్ట‌ర్ కూడా ఉన్నాడు. హీరోగానే కాకుండా నిర్మాత‌గానూ ఇప్ప‌టికే త‌న‌ను తాను నిరూపించుకున్న ధ‌నుష్‌... తాజాగా డైరెక్ట‌ర్‌గానూ మంచి మార్కులే కొట్టేశాడు. ధ‌నుష్ తొలి సారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌మిళ చిత్రం *ప‌వ‌ర్ పాండి* నిన్న త‌మిళ‌నాట ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

సీనియర్ న‌టులు రాజ్ కిర‌ణ్‌, రేవ‌తి ప్రధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ధ‌నుష్‌ అతిథి పాత్ర‌లో క‌నిపించాడు. తొలి రోజే ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను అందుకుంది. త‌న‌దైన శైలిలో న‌ట‌న‌తో పాటు నిర్మాత‌గా రాణిస్తూనే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్లోనూ తాను రాణించ‌గ‌ల‌న‌ని ధ‌నుష్ ఈ చిత్రం ద్వారా నిరూపించిన‌ట్లైంది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ధనుష్‌కు విశ్లేకులతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

ధ‌నుష్ త‌మ కుమారుడేనంటూ ఇటీవ‌ల రంగ‌ప్ర‌వేశం చేసిన ఓ వృద్ధ జంట పిటిష‌న్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ధ‌నుష్‌కు ఈ చిత్ర విజ‌యం కాసింత ఊర‌ట‌నిచ్చింద‌నే చెప్పాలి. కోర్టు విచార‌ణ‌లు, నిత్యం మీడియాలో క‌నిపిస్తున్న వార్త‌ల‌తో త‌ల ప‌ట్టుకున్న ధ‌నుష్‌... తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తొలి చిత్రం మీద ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌కుండా చూసుకోవ‌డంలోనూ స‌ఫ‌లీకృతుడ‌య్యాడ‌నే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English