ఆ వివాదంపై నోరు విప్పిన రాజమౌళి

ఆ వివాదంపై నోరు విప్పిన రాజమౌళి

దాదాపు రెండు నెలల నుంచి కన్నడ నాట ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందట కావేరి జలాల వివాదానికి సంబంధించి కర్ణాటకపై సత్యరాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని చూపించి.. ఆయన క్షమాపణ చెబితే తప్ప ‘బాహుబలి-2’ను కర్ణాటకలో విడుదల కానివ్వబోమని పట్టుబట్టుకుని కూర్చున్నాయి కన్నడ సంఘాలు.

సత్యరాజ్ ఒక క్యారెక్టర్ చేసిన సినిమాను 9 ఏళ్ల నాటి తన వ్యాఖ్యల్ని కారణంగా చూపించి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని కన్నడ జనాలు ఆలోచించట్లేదు. దీనిపై సత్యరాజ్ కానీ.. బాహుబలి టీం కానీ ఇప్పటిదాకా ఏం స్పందించలేదు. ఐతే విడుదలకు సమయం దగ్గరపడుతున్నా వివాదం పరిష్కారం కాకపోవడంతో రాజమౌళి రంగంలోకి దిగాడు.

కన్నడిగులకు సుతిమెత్తగా సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు జక్కన్న. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుందని.. ఆ స్వేచ్ఛను అందరూ గౌరవించాలని రాజమౌళి అన్నాడు. సత్యరాజ్ ‘బాహుబలి’ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే అని.. ఆయన నిర్మాతో.. దర్శకుడో.. హీరోనో కాదని రాజమౌళి అన్నాడు. సత్యరాజ్ తొమ్మిదేళ్ల కిందట చేసిన వ్యాఖ్యల్ని కారణంగా చూపించి ‘బాహుబలి’ని అడ్డుకోవడం బాధాకరమని రాజమౌళి అన్నాడు.

 ఈ తొమ్మిదేళ్లలో సత్యరాజ్ సినిమాలు కనీసం పాతికైనా విడుదలై ఉంటాయని.. వాటన్నింటినీ వదిలిపెట్టి ‘బాహుబలి’నే లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదని జక్కన్న చెప్పాడు. ఐతే ఇలాంటి లాజిక్స్ గురించి కన్నడ జనాలు పట్టించుకునే స్థితిలో లేరు. అక్కడి రాజకీయ నాయకులు.. కొన్ని సంఘాల నేతలు.. బాహుబలికి ఉన్న హైప్ చూసుకుని.. సత్యరాజ్ వివాదాన్ని తమ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి నిర్ణయించుకున్నాయి. అందుకే అంత పట్టుదలగా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో వివాదం ఎలా సద్దుమణుగుతుందో.. సినిమా అనుకున్న ప్రకారం విడుదలవుతుందో లేదో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English