ఆ టెస్ట్‌కి నో అంటే నో అంటున్న హీరో

ఆ టెస్ట్‌కి నో అంటే నో అంటున్న హీరో

త‌మిళ‌ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడు.. త‌మిళ‌నాడు యువ హీరో ధ‌నుష్ ఇటీవ‌ల ప‌లు ఇష్యూల్లో నానుతున్న విష‌యం తెలిసిందే. ఈమ‌ధ్య‌న సింగ‌ర్ సుచీలీక్స్ లో బాగా నానిన ధునుష్‌.. గ‌డిచిన కొంత కాలంగా త‌న త‌ల్లిదండ్రుల‌కు సంబంధించిన విష‌యంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులోని మ‌ధురై జిల్లా మేలూర్కు చెందిన క‌దిరేశ‌న్ - మీనాక్షి దంప‌తులు.. ధ‌నుష్ త‌న కొడుకుగా.. చిన్న‌ప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన త‌మ బిడ్డ‌గా పేర్కొంటూ.. మ‌ధురై కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేయ‌టం క‌ల‌క‌లం రేగింది.

ప్ర‌ముఖుల విష‌యంలో ఈ త‌ర‌హా ఇష్యూలు తెర మీద‌కు రావ‌టం.. అవి కాస్తా ఉత్తుత్తి ఆరోప‌ణ‌లుగా తేల‌టం కామ‌న్ అయిన నేప‌థ్యంలో ఈ ఇష్యూను మొదట్లో ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌ది లేదు. ఎప్పుడైతే.. ధ‌నుష్‌త‌న పుట్టుమ‌చ్చ‌ల్నితొలిగించుకున్నార‌న్న విష‌యాన్ని కోర్టు గుర్తించిందో.. అప్ప‌టి నుంచి ఈ హీరో ఒరిజిన‌ల్ త‌ల్లిదండ్రుల వాద‌న మీద అంద‌రి దృష్టి మ‌ళ్ల‌టం మొద‌లైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.

తాజాగా డీఎన్ఏ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ధ‌నుష్ త‌ల్లిదండ్రులుగా చెప్పుకుంటున్న వారు కోర‌టం.. అందుకు ధ‌నుష్ స‌సేమిరా అన‌టం ఇప్పుడు కొత్త ముచ్చ‌ట‌గా మారింది. తాము చెబుతున్న‌ట్లు ధ‌నుష్ త‌మ కుమారుడేనంటూ నిరూపించేందుకు అవ‌స‌ర‌మైన డీఎన్ఏ ప‌రీక్ష‌కు కోర్టు అనుమ‌తించాల‌ని కోరుతూ..క‌దిరేశ‌న్‌.. మీనాక్షి దంప‌తులు ఒక పిటీష‌న్‌ను దాఖ‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా.. వారివాద‌న‌ను ధ‌నుష్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు కొట్టి పారేశారు. ఇప్ప‌టికే తాము సంతృప్తిక‌ర‌మైన ఆధారాల్ని స‌మ‌ర్పించిన‌ట్లుగా ధ‌నుష్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వాదించారు. డీఎన్ఏ ప‌రీక్ష‌కు తాము ఒప్పుకునేది లేద‌న్నారు. ఇది ధ‌నుష్ ఆత్మ‌విశ్వాసానికి.. న‌మ్మ‌కానికి.. స్వేచ్ఛ‌కు సంబంధించిన అంశ‌మ‌ని.. ప‌రీక్ష‌కు ఒప్పుకోవ‌టం వాటికి భంగం వాటిల్లేలా చేస్తుంద‌ని వివ‌రించారు. దీంతో.. ధ‌నుష్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌ల్నివిన్న న్యాయ‌మూర్తి.. త‌దుప‌రి విచార‌ణ‌కు ఈ కేసును వాయిదా వేశారు. నిజానికి కోర్టుకు ఆధారాలు కావాలే త‌ప్పించి.. భావోద్వేగ అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోద‌న్న విష‌యాన్ని ధ‌నుష్ త‌ర‌ఫు న్యాయ‌వాది ఎందుకు మిస్ అయిన‌ట్లు? డీఎన్ఏ ప‌రీక్ష‌తో ఈ వివాదాన్ని శాశ్వితంగా క్లోజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ధ‌నుష్ అందుకు భిన్నంగా రియాక్ట్ కావ‌టం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English