పరుగులు పెట్టిస్తున్న త్రివిక్రమ్‌

పరుగులు పెట్టిస్తున్న త్రివిక్రమ్‌

పవన్‌కళ్యాణ్‌ కోసం దాదాపు అయిదు నెలల పాటు వేరే సినిమా ఏదీ చేయకుండా వేచి చూసిన త్రివిక్రమ్‌ ఇప్పుడు క్షణం తీరిక లేకుండా షూటింగ్‌ పరుగులు పెట్టిస్తున్నాడు. పది రోజుల క్రితం మొదలైన ఈచిత్రం టాకీ పార్ట్‌ షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

భారీ తారాగణం వున్న ఈ చిత్రంలో అందరు కీలక పాత్రధారుల్ని రామోజీ ఫిలిం సిటీకి రప్పించేసారు. అక్కడే హోటల్‌లో బస ఏర్పాటు చేసి ఉదయం తొమ్మిదింటికి ఠంచనుగా షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. సాయంత్రం ఆరు, ఏడు గంటల వరకు షూటింగ్‌ ఏకధాటిగా జరుగుతోందని, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పక్కాగా జరగడం వల్ల ఇంతవరకు అనుకున్నదానికంటే ఎక్కువే షూట్‌ చేసారని, ఇదే వేగం కొనసాగితే సెప్టెంబర్‌లో వస్తుందని అనుకున్న సినిమా ఆగస్టుకే రెడీ అయిపోతుందని అంటున్నారు.

ఇక్కడే మరో పది రోజులు టాకీ షూట్‌ చేసిన తర్వాత లొకేషన్‌ మారి రెండు యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ చేస్తారట. అటుపై విదేశాలకి వెళతారని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్‌ వెళుతోన్న స్పీడ్‌కి పవన్‌ కొద్ది కాలం రాజకీయ వ్యవహారాలకి దూరంగానే వుంటాడని చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు