శ్రీను వైట్లని పట్టించుకుంటారా?

శ్రీను వైట్లని పట్టించుకుంటారా?

ఒక టైమ్‌లో ఓవర్సీస్‌లో శ్రీను వైట్ల అంటే పెద్ద బ్రాండ్‌. మహేష్‌, పవన్‌, రాజమౌళి, త్రివిక్రమ్‌కి ధీటుగా శ్రీను వైట్ల చిత్రాలకి కూడా అక్కడ గిరాకీ వుండేది. వైట్ల సినిమాల్లో ఫ్యామిలీ డ్రామా, కామెడీ బ్రహ్మాండంగా వుంటుంది కాబట్టి అతని చిత్రాలకి బ్లైండ్‌గా వెళ్లిపోయేవాళ్లు. కానీ ఆగడు, బ్రూస్‌లీతో శ్రీను వైట్ల ఇమేజ్‌ బాగా డ్యామేజ్‌ అయింది. ఆ రెండు చిత్రాలతో ఇండస్ట్రీలో తన పరపతి పోగొట్టుకోవడమే కాకుండా ప్రేక్షకుల నమ్మకాన్ని సైతం అతను కోల్పోయాడు.

అయితే ఆ రెండు చిత్రాలని మర్చిపోయి వైట్ల తాజా చిత్రం 'మిస్టర్‌'కి ఓవర్సీస్‌ ఆడియన్స్‌ క్యూ కడతారని ఆశిస్తున్నారు. అందుకే మిస్టర్‌కి వందకి పైగా లొకేషన్లలో ప్రీమియర్‌ షోలు కూడా ప్లాన్‌ చేసారు. టాక్‌ ఏమిటో తెలియకుండా శ్రీను వైట్ల సినిమా చూసేందుకు జనం కదిలి వస్తారా అనేది అనుమానమే.

వరుణ్‌ తేజ్‌కి కూడా ఓవర్సీస్‌లో ఇంకా సాలిడ్‌ మార్కెట్‌ లేదు కనుక మౌత్‌ టాక్‌ మీదే ఈచిత్రం వసూళ్లు డిపెండ్‌ అవుతాయి. అసలే బాహుబలి ఫీవర్‌లో మునిగిన ఓవర్సీస్‌ ఆడియన్స్‌ గురు చిత్రాన్ని కూడా లెక్క చేయలేదు. ఈ నేపథ్యంలో మిస్టర్‌కి ఎలాంటి రిసెప్షన్‌ దక్కుతుందో చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు