మిస్టర్‌ కోసం మిస్‌ దండయాత్ర

మిస్టర్‌ కోసం మిస్‌ దండయాత్ర

సినిమా ప్రమోషన్లకి రెండు రోజులు కేటాయించడమే భాగ్యమన్నట్టు బిహేవ్‌ చేస్తుంటారు హీరోయిన్లు. కొత్తగా వచ్చిన హీరోయిన్లు తప్ప కాస్త పేరున్న వాళ్లెవరూ తమ చిత్రాలని ప్రమోట్‌ చేయరు. నయనతారలాంటి వారయితే పబ్లిసిటీ కోసం ఎక్స్‌ట్రా డబ్బులు ఆఫర్‌ చేసినా కానీ అది తమ పని కాదని అంటారు.

కానీ లావణ్య త్రిపాఠి మాత్రం తన సినిమాని అగ్రెసివ్‌గా ప్రమోట్‌ చేస్తోంది. మిస్టర్‌ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన లావణ్య ఈ చిత్రానికి పబ్లిసిటీ కుమ్మేస్తోంది. వరుణ్‌ తేజ్‌, శ్రీను వైట్లతో సమానంగా ఎక్కడ చూసినా లావణ్యే కనిపిస్తోంది. సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్‌ టైమ్‌లో తన కెరియర్‌కి వచ్చిన జోష్‌ ఆ తర్వాత కాస్త తగ్గింది.

ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు రాకపోయేసరికి లావణ్య ఇప్పుడు చేతిలో వున్న సినిమాలతోనే మరింతగా చొచ్చుకుపోవాలని చూస్తోంది. మిస్టర్‌తో పాటు రాధ చిత్రంలోను చేసిన లావణ్య ఈ రెండు చిత్రాల తర్వాత స్టార్‌ హీరోల నుంచి పిలుపు ఆశిస్తోంది. తనని చిన్న సినిమాల హీరోయిన్‌గానే చూస్తోన్న నిర్మాతలు లావణ్య నిస్వార్ధంగా పడుతోన్న కష్టం చూసి అయినా అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు