మెగాస్టార్‌ చిరంజీవి... అక్కడా బ్లాక్‌బస్టరే

మెగాస్టార్‌ చిరంజీవి... అక్కడా బ్లాక్‌బస్టరే

'ఖైదీ నంబర్‌ 150'పై వున్న హైప్‌, అంచనాలని లెక్క వేయాలంటే 'అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు' పాట విడుదలకి ముందు, తర్వాత అంటే సబబు. అంతకుముందు వరకు మెగా ఫాన్స్‌ కూడా కాస్త నీరసంగానే కనిపించే వారు కానీ ఈ పాట విడుదలైన తర్వాతే కుమ్ముడు స్టార్ట్‌ అయింది. ఫాన్స్‌ అందరిలోను 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అనే ఫీలింగ్‌ నిండింది.

అది మొదలైంది లగాయతు బాక్సాఫీస్‌ వద్ద వంద కోట్లకి పైగా షేర్‌ సాధించే వరకు బాస్‌ జైత్రయాత్ర ఆగలేదు. ఆ పాట కోసమే జనాలు రిపీట్స్‌గా సినిమాకి వచ్చారని, పాట అయిపోయిన తర్వాత వెళ్లిపోయారని అప్పుడు మీడియాలో రిపోర్ట్స్‌ వచ్చాయి. మెగాస్టార్‌కి గత వైభవం తెచ్చిపెట్టిన ఆ దేవి శ్రీ ప్రసాద్‌ పాట యూట్యూబ్‌లోను అంతే పెద్ద హిట్‌ అయింది. యూట్యూబ్‌లో ఈ పాట వీడియోని అప్‌లోడ్‌ చేసి సరిగ్గా యాభై రోజులయింది.

ఇంతవరకు దీనిని ఎన్నిసార్లు చూసారో తెలుసా? కోటి సార్లు!!! చిరంజీవి మళ్లీ డాన్స్‌ చేస్తుండగా చూడడం మాత్రమే కాకుండా బోనస్‌గా చిరుతో కలిసి చరణ్‌ కూడా చిందేసిన ఈ పాట ఎన్ని సార్లు చూసినా ఫాన్స్‌ తనివి తీరుతున్నట్టు లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే 'సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌' వచ్చేసింది. వచ్చే ఎనిమిది నెలల్లో దీనిని కొట్టే పాట ఇంకోటి వస్తుందంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు