నేను హిజ్రాలకు బ్రాండ్ అంబాసిడర్ని..

నేను హిజ్రాలకు బ్రాండ్ అంబాసిడర్ని..

రాఘవ లారెన్స్ చేసే మంచి పనుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వంద మందికి పైగా పిల్లలకు ఇప్పటిదాకా సర్జరీలు చేయించాడు లారెన్స్. దీంతో పాటుగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు లారెన్స్. ఐతే ఇందులోనూ లారెన్స్ తన ప్రత్యేకత చాటుకున్నాడు.

సమాజం చాలా చిన్నచూపు చూసే హిజ్రాలపై అతను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటాడు. తన బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంచన’లో హిజ్రా పాత్రను కీలకంగా మార్చిన లారెన్స్.. ఆ సినిమాలో వాళ్ల ఆవేదనను కళ్లకు కట్టాడు. నిజ జీవితంలోనూ వారికి లారెన్స్ ఎంతో తోడ్పాటు అందిస్తున్నాడు. తనకు హిజ్రాలంటే చాలా ఇష్టమని, తన టీంలోనూ వాళ్లున్నారని, వాళ్లను తనకు హిట్ సెంటిమెంటుగా భావిస్తానని అంటున్నాడు లారెన్స్.

‘‘నా సినిమా ఏదైనా రిలీజవుతోందంటే.. వెంటనే కొంత డబ్బు తీసి హిజ్రాల కోసం నేను ఓపెన్ చేసిన అకౌంట్లో వేస్తాను. వాళ్లు చాలా సంతోషిస్తారు. ఇది నాకు సెంటిమెంటుగా మారింది. వాళ్లను నా అదృష్టలక్ష్ములుగా భావిస్తాను. ‘కాంచన’ టైం నుంచి ఇలా చేస్తున్నా. హిజ్రాల్ని సమాజం చిన్న చూపు చూస్తోంది. అందుకే వారికి అండగా నిలవాలని అనుకున్నా. నేను హిజ్రాలకు బ్రాండ్ అంబాసిడర్ని. నిజంగానే హిజ్రాలు తమ కోసం పెట్టుకున్న సంఘంలో నా పేరును బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్నారు. వాళ్లంటే నాకెంతో ఇష్టం. అందుకే నా టీంలోనూ వాళ్లకు చోటిచ్చాను. నాతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అలాగే వికలాంగులన్నా నాకు ప్రత్యేకమైన ప్రేమ. నా సినిమాల్లో హిజ్రాలకు.. వికలాంగులకు ప్రత్యేకమైన పాత్రలు క్రియేట్ చేశాను’’ అని లారెన్స్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు