సూపర్ స్టార్‌కు పోటీగా బర్నింగ్ స్టార్

సూపర్ స్టార్‌కు పోటీగా బర్నింగ్ స్టార్

మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వస్తోంది. ఎట్టకేలకు మురుగదాస్-మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసేస్తున్నారు. ఏప్రిల్ 12న అంటే.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మహేష్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్ని పలకరించబోతోంది.

ఈ పోస్టర్‌తో పాటుగానే టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఒకేసారి జరిగిపోతుంది. దీంతో నెలల తరబడి ఎదురు చూపుల్లో ఉన్న మహేష్ అభిమానుల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది. రేపు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సోషల్ మీడియా అంతటా మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ గురించే డిస్కషన్ ఉంటుందనడంలో సందేహం లేదు.

ఐతే సూపర్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కాసేపటికే బర్నింగ్ స్టార్ కూడా సోషల్ మీడియాలో హంగామా చేయబోతున్నాడు. సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా ‘కొబ్బరిమట్ట’లో పాపారాయుడి పాటను మంగళవారం సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేస్తారట.

దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది సంపూ అండ్ టీం. మహేష్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినపుడు జనాలంతా సోషల్ మీడియాలోనే తిష్ట వేస్తారు కాబట్టి పనిలో పనిగా తమ సినిమా పాట కూడా లాంచ్ చేసేస్తే మంచి పబ్లిసిటీ వచ్చేస్తుందని ప్లాన్ చేసినట్లున్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఎదిగిన హీరో కాబట్టి.. చాన్నాళ్ల నుంచి విడుదలకు నోచుకోకుండా ఇబ్బంది పడుతున్న ‘కొబ్బరి మట్ట’కు హైప్ తేవడానికి ఇదే మంచి మార్గంగా భావించినట్లున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు