చరణ్‌ అంత రిస్క్‌ చేయగలడా?

చరణ్‌ అంత రిస్క్‌ చేయగలడా?

'ప్రతి సినిమా వ్యాపారం కోసమే చేయకు. కొన్ని సినిమాలు గుర్తుండిపోవడానికి చెయ్యి' అంటూ మణిరత్నం అన్న మాట తనని చాలా కాలం వెంటాడిందని, ఆయన మాటల్ని సీరియస్‌గా తీసుకునే ధృవ నుంచి పంథా మార్చానని చరణ్‌ చెప్పాడు.

అప్పుడు చరణ్‌ రిజెక్ట్‌ చేసిన కథే చెలియా సినిమాగా రూపొంది రిలీజ్‌ అయింది. మొదటి ఆటకే రిజెక్ట్‌ అయిపోయిన ఈ చిత్రం కాదని చరణ్‌ మంచి పనే చేసాడని అంటున్నారు. అయితే మణిరత్నం తదుపరి చిత్రంలో నటించడానికి చరణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆచిత్రంలో చరణ్‌తో పాటు అరవింద్‌ స్వామి కూడా కీలక పాత్ర చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. సుకుమార్‌ చిత్రం తర్వాత చరణ్‌ చేసేది ఇదే చిత్రమని చెబుతున్నారు.

అయితే చెలియా ఫలితంతో చరణ్‌ అభిమానులు కంగారు పడుతున్నారు. ఎక్కడ మాట మీద నిలబడి మణితో సినిమా చేసేస్తాడోనని చరణ్‌ని కలుసుకుని ఈ ప్రాజెక్ట్‌ డ్రాప్‌ అవమని రిక్వెస్ట్‌ చేయడానికి ఫాన్స్‌ బయల్దేరుతున్నారు. చరణ్‌ కూడా 'చెలియా' ఫలితం ఏమిటనేది తెలుసుకునే వుంటాడు.

మరి తన ఇమేజ్‌ మార్చుకునే బాటలో ఇలాంటి ప్రయోగాలకి, పరాజయాలకి భయపడకూడదనే అనుకుంటాడో, లేక కాస్త గ్యాప్‌ ఇచ్చి మణిరత్నం డైరెక్షన్‌లో చేసే ముచ్చట తీర్చుకుంటాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు