బాక్సింగ్‌ బ్యూటీ మసాలాతో కిక్కిస్తుందా?

బాక్సింగ్‌ బ్యూటీ మసాలాతో కిక్కిస్తుందా?

'గురు' చిత్రంలో స్లమ్‌ గాళ్‌గా జీవించిన రితిక సింగ్‌ స్వతహాగా బాక్సర్‌. బాక్సింగ్‌ తెలిసిన అమ్మాయి కావాలంటూ దర్శకురాలు సుధ కొంగర చాలా మంది బాక్సర్లని చూసి ఫైనల్‌గా రితికని సెలక్ట్‌ చేసుకుంది. నటనపై ఆసక్తి లేకపోయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రితిక ఆ చిత్రం మూడు వెర్షన్లలోను హీరోయిన్‌ రోల్‌ చేసి అందరి నుంచి ప్రశంసలు అందుకుంది.

హీరోయిన్‌ అంటూ అయిపోయాక ఇక అన్నిసార్లు బాక్సర్‌ క్యారెక్టర్లు రావు కాబట్టి తాను కూడా మసాలా పాత్రలపై ఆసక్తి చూపిస్తోంది. లారెన్స్‌ హీరోగా రూపొందిన శివలింగ చిత్రంలో రితిక సగటు కమర్షియల్‌ హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేసింది. స్లమ్‌ గాళ్‌గా అదరగొట్టిన రితిక మరి గ్లామర్‌ క్యారెక్టర్‌లో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

ఇంతవరకు తనపై 'గురు' పాత్రలోని ఇమేజ్‌ ఒక్కటే వుంది కనుక రితికని ప్రేక్షకులు సగటు హీరోయిన్‌లా చూడలేదు. సాధారణంగా ఇంత ఇంపాక్ట్‌ వేసిన పాత్ర చేసిన నటీనటులు ఎవరైనా కానీ టైప్‌ కాస్ట్‌ అయిపోతారు. ప్రేక్షకులు వారిని మరో రకంగా చూడ్డానికి ఇష్టపడరు. హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే ఆ తరహా పాత్రలకి పరిమితం అయితే కుదరదు కనుక రితిక ఇప్పుడీ చిత్రంతో తన సత్తా చాటుకోవాలి. రెగ్యులర్‌ మసాలా సినిమాలతోను మెప్పించగలనని చూపించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English