చిరంజీవి పరువు తీసేస్తున్నాడు

చిరంజీవి పరువు తీసేస్తున్నాడు

'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ స్థానంలో ముందుగా రాజ్‌కిరణ్‌ అనే తమిళ సీనియర్‌ నటుడు తాత పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో చాలా రోజులు షూటింగ్‌ చేసిన తర్వాత రాజ్‌ కిరణ్‌ని తొలగించి ఆ స్థానంలో ప్రకాష్‌రాజ్‌ని తీసుకున్నారు. అయితే తనని ఎందుకు తొలగించారనేది కనీసం రాజ్‌కిరణ్‌కి ఎవరూ చెప్పలేదట.

నిర్మాత బండ్ల గణేష్‌ తనకి ఇవ్వాల్సిన పది లక్షల పారితోషికం కూడా ఎగవేసాడట. కృష్ణవంశీ, చిరంజీవి, రామ్‌ చరణ్‌లలో ఏ ఒక్కరైనా కనీసం తనకి కాల్‌ చేసి అయినా ఇదీ సంగతి అని చెప్పకుండా సినిమా నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. గోవిందుడు రషెస్‌ చూసిన చిరంజీవి 'ఇందులో హీరో రామ్‌ చరణా, రాజ్‌ కిరణా' అని అడిగారని, దాంతో తాతయ్య పాత్ర హీరోయిజం తగ్గించి కథ వేరేలా రాసుకున్నారని కూడా రాజ్‌కిరణ్‌ ఈ సందర్భంగా చెప్పారు.

తనని తొలగించారని తెలిసినపుడు ప్రకాష్‌రాజ్‌ తననుంచి ఎన్‌ఓసి తీసుకోమని కూడా నిర్మాతకి చెప్పాడని, కానీ తననుంచి అలాంటిదేం తీసుకోలేదని, తనలాంటి సీనియర్‌ని చాలా అగౌరవపరిచారని రాజ్‌కిరణ్‌ అన్నారు. ఇలాంటివి చిరంజీవి, చరణ్‌ చూసుకునే విషయాలు కాదు. వీటిని నిర్మాత బండ్ల గణేష్‌ పరిష్కరించుకోవాలి. కానీ అతను దీనిని లెక్క చేయకపోవడంతో ఇప్పుడు చిరంజీవి, చరణ్‌ల పరువు పోతోంది. సీనియర్‌ నటులకి గౌరవం ఇవ్వరనే అపవాదు మిగిలిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు