‘ఉయ్యాలవాడ’కు మ్యూజిక్ అతనా?

‘ఉయ్యాలవాడ’కు మ్యూజిక్ అతనా?

సంగీత దర్శకుడు తమన్ తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో పని చేశాడు. ఐతే అవన్నీ కూడా చాలా వరకు కమర్షియల్ సినిమాలే. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలేవీ కూడా అతను ఇంత వరకు చేయలేదు. ఐతే అతడికి ఆ లోటు తీరబోతున్నట్లే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న పీరియడ్ మూవీ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’కి తమన్ సంగీతాన్నందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ‘ఉయ్యాలవాడ..’కు తానే సంగీత దర్శకుడని పరోక్షంగా చెప్పాడు తమన్.

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడన్న సంగతి తెలిసిందే. నాలుగు నెలల నుంచి సురేందర్ ఈ సినిమా మీదే పని చేస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చింది కూడా. త్వరలోనే సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకోనుంది. ఈ టైంలో తమన్.. సురేందర్ తో కలిసి ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో పాటు ‘నా కిక్.. నా రేసు గుర్రం.. మరి ఇప్పుడు..?’ అని కామెంట్ చేశాడు.

దీన్ని బట్టి చూస్తుంటే మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ తెరమీదికి రానున్నట్లే తెలుస్తోంది. సురేందర్ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’నే కాబట్టి దానికి తమనే సంగీత దర్శకుడని ఫిక్సయిపోవచ్చేమో. ఐతే ఇప్పటిదాకా చాలా వరకు కమర్షియల్ సినిమాలకే మ్యూజిక్ ఇచ్చిన తమన్.. ఇలాంటి ప్రత్యేకమైన సినిమాకు ఎలాంటి సంగీతాన్నందిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు