మరి ఏఎన్నార్‌ను కడసారి ఎందుకు చూడనట్లు?

మరి ఏఎన్నార్‌ను కడసారి ఎందుకు చూడనట్లు?

సెలబ్రెటీలతో వచ్చిన గొడవ ఇదే. సహ నటులతోనో టెక్నీషియన్లతోనో పెట్టుకోవాల్సిన సున్నమంతా పెట్టుకుంటారు. విభేదాలు సమసిపోగానే వచ్చి మీడియా మీద పడతారు. గతంలో ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. అక్కినేని నాగార్జున-నందమూరి బాలకృష్ణల మధ్య వివాదానికి సంబంధించిన ముగింపు కూడా ఇలాగే ఉంది మరి. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ పరస్పరం ఎంత దూరం పాటిస్తున్నారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడేమో తమ మధ్య ఏమీ లేదని.. అంతా మీడియానే క్రియేట్ చేసిందని కామెంట్లు చేసేశాడు నాగ్.

ఒకప్పుడు తమ తండ్రుల స్నేహం తాలూకు వారసత్వాన్ని కొనసాగిస్తూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి సాగిన నాగ్-బాలయ్యల మధ్య ఎక్కడ తేడా కొట్టిందో ఏమో కానీ.. గత కొన్నేళ్లుగా ఇద్దరూ దూరం దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య జరిగిన ‘మేము సైతం’ వేడుకలో కూడా అంటీ ముట్టనట్లు ఉన్నారు. చివరికి బాలయ్య తండ్రి తర్వాత తండ్రిలా భావించే ఏఎన్నార్ చనిపోతే కడసారి చూపు చూడటానికి కూడా రాలేదు. దీన్ని బట్టి నాగార్జునతో బాలయ్యకు ఏ స్థాయిలో విభేదాలు తలెత్తాయో అర్థం చేసుకోవచ్చు.

ఏఎన్నార్ చనిపోయినపుడు బాలయ్య రాకపోవడంపై మీడియాలో ఎన్నో కథనాలు వచ్చినా దాని గురించి బాలయ్య కానీ.. నాగ్ కానీ స్పందించింది లేదు. కానీ ఈ మధ్య ఎవరు రాయబారం నడిపారో ఏమో కానీ.. ఇద్దరి మధ్య దూరం తగ్గినట్లుంది. ఇలాంటి సమయంలోనే టీఎస్సార్ అవార్డుల వేడుక జరిగింది. అక్కడికి ఇద్దరూ హాజరయ్యారు. అంతే.. సింపుల్‌గా మీడియా మీద నింద వేసేసి ఇద్దరి మధ్య అసలేమాత్రం విభేదాలు లేవన్నట్లు షో చేసేశారు. మరి గొడవలేమీ లేనపుడు ఏఎన్నార్ కడసారి చూపుకు బాలయ్య ఎందుకు రాలేదో ఇద్దరిలో ఎవరో ఒకరు స్పష్టత ఇవ్వొచ్చుగా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు