అజిత్... `ఆట ఆరంభం`

అజిత్... `ఆట ఆరంభం`

`బిల్లా` సినిమాతో అజిత్ కి భారీ విజయాన్నిచ్చారు  విష్ణువర్ధన్. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ జతకట్టారు. ఈ కలయికలో `ఆరంభం` అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అజిత్ సరసన నయనతార, తాప్సి కథానాయికలుగా నటిస్తున్నారు.  రానా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఎ.యమ్.రత్నం నిర్మాత. ఈ చిత్రం తెలుగులో   `ఆట ఆరంభం` పేరుతో విడుదలవుతోంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై తమిళంలో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా రానాతో కీలక పాత్ర చేయిస్తున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ తో `పంజా` అనే సినిమా తీసి పరాజయాన్ని చవిచూసిన విష్ణు వర్ధన్ ఈ సారి మాత్రం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. త్వరలోనే పాటలను విడుదల చేస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు