మెగా హీరోకి లారెన్స్‌ భయం

మెగా హీరోకి లారెన్స్‌ భయం

ఇంతవరకు హిట్టు దక్కని మెగా హీరో వరుణ్‌ తేజ్‌ 'మిస్టర్‌'పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన కెరియర్లో అతను అటెంప్ట్‌ చేస్తోన్న తొలి కమర్షియల్‌ చిత్రం కావడంతో ఈసారి విజయం ఖాయమని నమ్ముతున్నాడు. ట్రెయిలర్‌కి రెస్పాన్స్‌ ఆశించిన స్థాయిలో లేనప్పటికీ వేసవిలో ఫ్యామిలీ ప్రేక్షకులు కోరుకునే వినోదం అందించే చిత్రమవుతుందని అనుకుంటున్నాడు.

వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న మిస్టర్‌కి బాహుబలి వచ్చేవరకు అడ్డు వుండదని అనుకున్నారు కానీ అదే రోజున లారెన్స్‌ సినిమా 'శివలింగ' కూడా రిలీజ్‌ అవుతోంది. లారెన్స్‌ చిత్రాలకి మాస్‌లో వుండే ఆదరణ ఎలాంటిదనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందులోను అతని హారర్‌ సినిమాలనేసరికి జనం ఎగబడిపోతారు. కనుక అనువాద చిత్రమైనప్పటికీ శివలింగ ఖచ్చితంగా మిస్టర్‌కి పెద్ద కాంపిటీషన్‌ అవుతుంది.

బి, సి కేంద్రాల్లో మిస్టర్‌ వసూళ్లపై శివలింగ ప్రభావం వుంటుంది. లారెన్స్‌ సినిమాని బయ్యర్లు ఎగబడి కొనేయడాన్ని బట్టే దానికున్న క్రేజ్‌ ఏంటనేది తెలుస్తోంది. లారెన్స్‌ ధాటిని తట్టుకుని మిస్టర్‌ నిలబడతాడా లేక ఏ సెంటర్స్‌కి పరిమితమవుతాడా అనేది చూడాలి. ఈ చిత్రం శ్రీను వైట్లకి కూడా చాలా కీలకం కనుక అతనికీ శివలింగతో తలనొప్పే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు