సూపర్‌స్టార్‌ పిలిచినా పొమ్మనేసింది

సూపర్‌స్టార్‌ పిలిచినా పొమ్మనేసింది

ఆలియా భట్‌ అనతి కాలంలోనే అత్యుత్తమ నటిగా కితాబులు అందుకుంది. ప్రతి సినిమాలోను ఉత్తమ నటనతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అత్యుత్తమ తారల సరసన ఆలియా చేరిపోయింది. షారుక్‌ ఖాన్‌తో కలిసి చేసిన డియర్‌ జిందగీ చిత్రం ఆలియాలోని గొప్ప నటిని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో ఆమెకి మరిన్ని పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

ఆమీర్‌ ఖాన్‌తో ఆదిత్య చోప్రా ప్లాన్‌ చేస్తోన్న 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' చిత్రంలో హీరోయిన్‌గా ఆలియాని అడిగారు. అయితే కథ వినేసి తాను నటించనని ఆలియా చెప్పేసిందట. తన పాత్రకి అసలు ప్రాధాన్యత లేదని, ఆమీర్‌ ఖాన్‌ సినిమా అయినప్పటికీ తను ఒప్పుకోవాలంటే క్యారెక్టర్‌లో దమ్ముండాలని తెగేసి చెప్పిందట. మామూలుగా ఏ హీరోయిన్‌ అయినా ఆమీర్‌ సినిమా అని ఎగిరి గంతేస్తుంది.

కానీ ఆలియా మాత్రం తన పాత్ర నచ్చితేనే చేస్తానంటోంది. ఈ చిత్రాన్ని ముందుగా హృతిక్‌తో తలపెట్టినపుడు అతను కూడా హీరోయిన్‌ క్యారెక్టర్‌ డెవలప్‌ చేయాలని చెప్పాడట. కానీ అతడినే మార్చేయడంతో ఇక ఆ పాయింట్‌ని ఇంతకాలం పట్టించుకోలేదు. కానీ మంచి నటి కావాలంటే సదరు క్యారెక్టర్‌ని పెంచక తప్పేటట్టు లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు