బూతు ఇమేజ్‌ పట్ల భయపడుతోన్న హీరో

బూతు ఇమేజ్‌ పట్ల భయపడుతోన్న హీరో

నటుడిగా సొఫెస్టికేటెడ్‌ పాత్రలు చేసే అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడిగా కూడా క్లీన్‌ ముద్ర వేసి విమర్శకుల్ని మెప్పించాడు. జెంటిల్‌మేన్‌ ఇమేజ్‌ వున్న అవసరాల శ్రీనివాస్‌ ఎందుకో ధైర్యం చేసి 'బాబు బాగా బిజీ'లాంటి బూతు కామెడీ చేసాడు. హిందీలో ఎవరో అనామక హీరో చేసిన హంటర్‌ చిత్రాన్ని తెలుగులో అవసరాల చేస్తున్నాడని తెలిసినపుడే చాలా మంది ఇదేంటని అనుకున్నారు.

అయితే ఏదో పిచ్చి ధైర్యంతో ముందుకెళ్లి సినిమా పూర్తి చేసిన అవసరాల శ్రీనివాస్‌ ట్రెయిలర్‌ రిలీజ్‌ అయిన దగ్గర్నుంచీ వర్రీ అవుతున్నాడట. ఈ ట్రెయిలర్‌ చూసిన వాళ్లంతా ఎందుకిలాంటిది చేసావని అడుగుతుంటే, తన ధైర్యాన్ని మెచ్చుకుంటారని ఆశించిన అవసరాల షాక్‌ అవుతున్నాడట. ట్రెయిలర్‌ పెద్ద హిట్‌ అయి లక్షల కొద్దీ వ్యూస్‌ సాధించిందని నిర్మాతలు సంబరాల్లో మునిగిపోతే, ఈ సినిమా చేయడం పట్ల అవసరాల శ్రీనివాస్‌ రిగ్రెట్‌ అవుతున్నాడట. ఇందులో కాస్త ఘాటుగా అనిపించిన సన్నివేశాలు తొలగించమని రిక్వెస్ట్‌ చేస్తున్నాడట.

కానీ ట్రెయిలర్‌ చూసిన బయ్యర్లు ఈ చిత్రం నుంచి చాలా హాటైన సీన్లు ఆశిస్తున్నారు కనుక ఆ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఎడిటింగ్‌కి సమ్మతించకపోవచ్చు. తన బోల్డ్‌ మూవ్‌ ట్రెండ్‌ సెట్‌ చేస్తుందని అనుకుంటే రివర్స్‌లో మెడకి చుట్టుకునే సరికి అవసరాల తల పట్టుకుని కూర్చున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English