బాహుబలి వచ్చిన వారానికే..

బాహుబలి వచ్చిన వారానికే..

‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజయ్యే వీకెండ్లోనే కాదు.. దానికి ముందు, తర్వాతి వారాంతాల్లోనూ సినిమాలు విడుదల చేయడానికి బాలీవుడ్ వాళ్లే భయపడుతున్నారు. ఆ మూడు వారాల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ షెడ్యూల్ అయి లేవు. తమిళం, మలయాళ భాషల్లోనూ ఇదే పరిస్థితి. ఐతే తెలుగులో మాత్రం ‘బాహుబలి-2’ రిలీజైన వారానికి ఓ మీడియం రేంజి సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. ఆ సినిమానే.. బాబు బాగా బిజీ.  

అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘బాబు బాగా బిజీ’ని ఏప్రిల్ 13నే రిలీజ్ చేయాలనుకున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వేశారు. కానీ ఎందుకో ఇప్పుడు ఆలోచన మారిపోయింది. బాహుబలి తర్వాతి వీకెండ్లో.. అంటే మే 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘బాహుబలి’ ప్రభంజనం ఒక్క వారానికి పరిమతం అవుతుందని ఎవ్వరూ అనుకోవట్లేదు. కనీసం రెండు మూడు వారాలైనా ఆ మేనియా కొనసాగుతుందని భావిస్తున్నారు.

అలాంటిది ఆ సినిమా వచ్చిన వారానికే ‘బాబు బాగా బిజీ’ని రిలీజ్ చేయాలనుకోవడం సాహసమే. మరి ‘మిస్టర్’తో పోటీ వద్దనుకుని.. ‘బాహుబలి’తో తలపడాలని ఎందుకు డిసైడయ్యారో ఏంటో? సినిమాను ఏప్రిల్ 13కు రెడీ చేయలేక వాయిదా వేశారో ఏమో తెలియదు. ఈ చిత్రం హిందీలో హిట్టయిన అడల్ట్ కామెడీ ‘హంటర్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు