పీకే రికార్డులేవీ మిగలకూడదంట

పీకే రికార్డులేవీ మిగలకూడదంట

'బాహుబలి 2' బిజినెస్సే అయిదు వందల కోట్ల స్థాయిలో జరిగినట్టు భోగట్టా. మొదటి భాగం కంటే ఎక్కువగా ఈ చిత్రానికి బిజినెస్‌ జరగడానికి కారణం హిందీ, తమిళం నుంచి పెరిగిన ఆదరణే అనేది తెలిసిందే. ఆ రెండు భాషల నుంచి మొదటి వెర్షన్‌కి జరిగిన దానికి రెట్టింపు బిజినెస్‌ జరిగింది.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో రిలీజ్‌ అవుతోన్న ఈ చిత్రం భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని అందుకుంటుందనే అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అమీర్‌ఖాన్‌ నటించిన పీకే చిత్రాన్నే బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నారట. ఆ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల తొంభై రెండు కోట్ల గ్రాస్‌ వసూలయింది. ఇదే భారత సినిమా పరంగా అతి పెద్ద రికార్డు. అయితే ఇది కేవలం ఒక్క భాషలోనే రిలీజ్‌ అయి సాధించిన రికార్డు.

బాహుబలి నాలుగు భాషల్లో రిలీజ్‌ అవుతోంది కనుక మొత్తంగా కలిపి వెయ్యి కోట్ల గ్రాస్‌ తక్కువ రాదని భావిస్తున్నారు. పీకే ఏయే దేశాల్లో అయితే విడుదలైందో అన్ని చోట్ల దీనిని విడుదల చేయాలని, హాలీవుడ్‌, చైనీస్‌ చిత్రాల మాదిరిగా అన్ని దేశాల్లో విడుదల చేసి బాహుబలి బ్రాండ్‌ని జగద్విదితం చేయాలని చూస్తున్నారని సమాచారం. అయితే వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ కంటే ముందుగా ఇండియన్‌ సినిమాకి మార్కెట్‌ వున్న దేశాల మీదే దృష్టి పెట్టారు. ఇక్కడ సంచలనాలు అయిపోయిన తర్వాత గ్లోబల్‌ రిలీజ్‌ మీద కాన్సన్‌ట్రేట్‌ చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు