అస్సలు సౌండే లేదు... ఆడుతుందా?

అస్సలు సౌండే లేదు... ఆడుతుందా?

రేపు రిలీజ్‌ అవుతోన్న మణిరత్నం చిత్రం 'చెలియా'కి అస్సలు ప్రీ రిలీజ్‌ బజ్‌ అంటూ రాలేదు. టీజర్లు, ట్రెయిలర్లు అంటూ చాలానే విడుదల చేసినా, వీడియో సాంగ్స్‌ సైతం చూపించినా కానీ దీనిపై ఎందుకో యువత అంత ఆసక్తి చూపించడం లేదు.

మణిరత్నం ప్రేమకథలకి పెట్టింది పేరయినప్పటికీ, ఈ చిత్రం ఏదో సీరియస్‌ యవ్వారంలా కనిపిస్తూ వుండడంతో జనాలు అంతగా ఎట్రాక్ట్‌ అవడం లేదు. మణిరత్నం సినిమా అంటే కనీసం మల్టీప్లెక్సుల్లో అయినా సందడి వుండాలి. కానీ ఈ చిత్రానికి అలాంటి ఛాయలేమీ లేవు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చాలా డల్‌గా వుండడంతో ఇక రిలీజ్‌ అయిన తర్వాత వచ్చే టాక్‌ మీదే ఫ్యూచర్‌ డిపెండ్‌ అయి వుంటుందని అంటున్నారు.

కార్తీకి మాస్‌లో ఫాలోయింగ్‌ వున్నప్పటికీ ఈ చిత్రంలో అతని లుక్‌ మాస్‌కి నచ్చేలా లేదు. మణిరత్నం సినిమాలంటేనే మాస్‌ జనాలకి రీచ్‌ అవ్వవు కాబట్టి చెలియాపై అలాంటి ఆశలేమీ పెట్టుకోరెవరూ. కానీ అర్బన్‌ యూత్‌నుంచి అయినా ఖచ్చితంగా రెస్పాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు.

ఓకే బంగారం చిత్రానికి వచ్చిన ఊపు, ఉత్సాహం మాత్రం దీనికి ఖచ్చితంగా రాలేదు. గురు తప్ప సరిగ్గా ఆడుతోన్న సినిమానే లేకపోవడంతో చెలియా ఈ వీకెండ్‌లో సందడి చేస్తుందని ట్రేడ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తోంది కానీ ఇదేమో అస్సలు సౌండే చేయడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English