రిలీజ్ డేట్‌తో ‘మిస్టర్’ ఆటలు

రిలీజ్ డేట్‌తో ‘మిస్టర్’ ఆటలు

ముందేమో ఏప్రిల్ 14న రిలీజ్ అన్నారు. ఆ తర్వాత కాదు కాదు.. ఒక రోజు ముందే అంటే 13వ తేదీనే వచ్చేస్తున్నాం అన్నారు. కానీ ఇప్పుడు తూచ్.. 13న కాదు, ముందు అన్నట్లే 14న వస్తాం అంటున్నారు. ‘మిస్టర్’ టీం రిలీజ్ డేట్ ఆటలు ఇలా ఉన్నాయి మరి. తాజా ప్రకటన ప్రకారం ‘మిస్టర్’ ఏప్రిల్ 14నే విడుదలవుతుందట. ఇలా పదే పదే రిలీజ్ డేట్ ఎందుకు మార్చాల్సి వస్తోందో కారణాలు మాత్రం వెల్లడించలేదు.

14న రిలీజ్ అనేది ఫైనల్ అని మాత్రం స్పష్టం చేశారు. కాబట్టి మెగా అభిమానులు ఆ డేటుకే ఫిక్సయిపోవచ్చు. బహుశా లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ కోసం గురువారమే సినిమాను రిలీజ్ చేయాలనుకుని.. మళ్లీ శుక్రవారం సెంటిమెంటుతో మనసు మార్చుకున్నారేమో.

శ్రీను వైట్ల ‘ఆగడు’, ‘బ్రూస్ లీ’ లాంటి డిజాస్టర్ల తర్వాత తీసిన సినిమా ఇది. వరుణ్ తేజ్ కూడా ‘లోఫర్’ లాంటి చెత్త సినిమా తర్వాత చేసిన సినిమా ఇది. ఇక నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధుల నుంచి ‘విన్నర్’ లాంటి ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది.

అందుకే ‘మిస్టర్’ మీద చాలా ఆశలతో ఉంది ఈ టీం. టీజర్.. ట్రైలర్ పర్వాలేదనిపించాయి కానీ.. సినిమాపై మరీ అంత హైప్ ఏమీ లేదు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రావడానికి రెండు వారాల ముందు రిలీజవుతున్న ఈ చిత్రం సమ్మర్ సెలవుల్లో మంచి వసూళ్లే వస్తాయని ఆశిస్తోంది. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కీలకం. మరి ఈ నెల 14న ఏం జరుగుతుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు