ఆ హీరోయిన్ కోసం కొట్టేసుకున్న హీరోలు

ఆ హీరోయిన్ కోసం కొట్టేసుకున్న హీరోలు

దేశంలో అత్య‌ధిక చిత్రాలు నిర్మించే సినిమా ఇండ‌స్ట్రీగా టాలీవుడ్ కి పేరు ప్ర‌ఖ్యాతులుఉన్నా.. ఇక్క‌డ న‌టీన‌టుల గురించి బ‌య‌ట‌కు వ‌చ్చే గాసిప్స్ చాలా త‌క్కువ‌. చాలా చాలా ర‌చ్చ జ‌రిగితే త‌ప్ప‌.. మామూలు విష‌యాలు దాదాపుగా బ‌య‌ట‌కు రావ‌నే చెప్పాలి. మ‌న పొరుగున ఉన్న కోలీవుడ్ లో అయితే.. ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. అక్క‌డ అలా జ‌రిగిందో లేదో.. ఇలా విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి. ఇక‌.. కాస్త దూరాన ఉన్న బాలీవుడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అక్క‌డి హీరో.. హీరోయిన్స్ మ‌ధ్య డేటింగ్ ద‌గ్గ‌ర నుంచి బెడ్రూం సంగ‌తుల వ‌ర‌కూ ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అయిపోతుంటాయి. వీటిల్లో నిజానిజాల సంగ‌తి ఎలా ఉన్నా.. విష‌యాలైతే మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చి.. అంద‌రూ ఆస‌క్తిగా చ‌ర్చించుకోవ‌టం క‌నిపిస్తుంటుంది.

తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఒక ఇష్యూ ఇప్పుడు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఒక హీరోయిన్ కోసం ఇద్ద‌రు యువ హీరోలు గొడ‌వ‌ప‌డ‌టం.. ఒక ద‌శ‌లో కొట్లాట వ‌ర‌కూ వీరి పంచాయితీ వెళ్లింద‌న్న మాట వినిపిస్తోంది. ఇందులో నిజానిజాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. హాట్ టాపిక్ గా మారిన  ఈ ఇష్యూకు సంబంధించిన హీరోయిన్ ఎవ‌రు? ఆమె కోసం తెగ ఇదైపోయిన హీరోలు ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే.. అందాల భామ శ్ర‌ద్ధాక‌పూర్ అని చెబుతున్నారు.

ఇటీవ‌ల మ‌హేశ్ భ‌ట్ ఫ్యామిలీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి థ‌ర్టీ ఇయ‌ర్స్ అయిన సంద‌ర్బాన్ని పుర‌స్క‌రించుకొని ఒక భారీ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి చాలామంది జంట‌లు జంట‌లుగా వ‌చ్చారు. అలానే వ‌చ్చారు..ఆషికీ స్టార్స్ ఆదిత్య‌.. శ్ర‌ద్ధ‌. వీరిద్ద‌రి మ‌ధ్య ఆషికి మూవీ టైంలో రొమాన్స్ న‌డిచింద‌ని.. ఇద్ద‌రు క‌లిసి బాగానే తిరిగార‌న్న‌రూమ‌ర్ ఉంది. దీన్ని ప‌క్క‌న పెడితే.. శ్ర‌ద్ధ‌తో క‌లిసి ప‌ని చేసిన మ‌రో హీరో ఫ‌ర్హాన్ అక్త‌ర్ గా వీరి ముచ్చ‌ట అస్స‌లు న‌చ్చ‌లేద‌ట‌. ఆయ‌న‌కు ఎందుకంత క‌డుపు మంట అంటే.. రాక్ ఆన్ 2లో ప‌ర్హాన్ తో శ్ర‌ద్ధ క‌లిసి ప‌ని చేసింది. ఆ మూవీ టైంలో ఇద్ద‌రి మ‌ధ్య లవ్ ఎపిసోడ్ షురూ అయ్యింద‌న్న‌ది ఒక టాక్‌.

త‌న క‌ళ్ల ముందే.. మ‌రొక‌రితో శ్ర‌ద్ధ రావ‌టం అస్స‌లు న‌చ్చ‌లేద‌ట‌. ఆదిత్య‌తో మాటల యుద్ధానికి దిగాడ‌ని.. ప‌రిస్థితి అంత‌కంత‌కూ ముదిరి బాహాబాహి వ‌ర‌కూ వెళ్లింద‌ని చెబుతున్నారు. గొడ‌వను కంట్రోల్ చేయ‌టానికి శ్ర‌ద్ధ ఎంతో ట్రై చేసినా కంట్రోల్ కాలేదంటున్నారు. గొడ‌వ జ‌రిగి.. పార్టీ ముగిసిన త‌ర్వాత ఫ‌ర్హాన్‌కు స‌ర్ది చెప్పేందుకు అత‌డి ఇంటికి శ్ర‌ద్ధ వెళ్లిన‌ట్లుగా టాక్‌. ఇందులో నిజం ఎంతుందన్న‌ది ప‌క్క‌న పెడితే.. మ‌సాలా మూవీకి త‌గ్గ విష‌యం ఉండ‌టంతో.. నిజానిజాల్ని ప‌క్క‌న పెట్టేసి.. దీని గురించి అంద‌రూ ఆస‌క్తిగా మాట్లాడేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు