చరణ్‌, సుకుమార్‌ల షూటింగ్‌ కష్టమేనటండోయ్‌

చరణ్‌, సుకుమార్‌ల షూటింగ్‌ కష్టమేనటండోయ్‌

ఫిబ్రవరిలో మొదలు కావాల్సిన షూటింగ్‌ని తాపీగా ఏప్రిల్‌లో స్టార్ట్‌ చేసిన రామ్‌ చరణ్‌కి కోస్తా జిల్లాల్లో చుక్కలు కనిపిస్తున్నాయట. ఎండలు తీవ్రంగా వుండడంతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేస్తోన్న షూటింగ్‌తో యాక్టర్లు, యూనిట్‌ సభ్యులు సాయంత్రానికి తేల కళ్లు వేస్తున్నారట. వేసవి కాలంలో కోస్తా ప్రాంతంలో ఆరు బయట షూటింగ్‌ అంటే జరిగే పని కాదు.

అంత వేడిలో పర్‌ఫెక్ట్‌గా అనుకున్నది అనుకున్నట్టు రావాలన్నా కుదరదు. ఇప్పటికి అయిదు రోజుల షూటింగ్‌ అయితే చేసారు కానీ రోజూ ఎంత చేద్దామనుకున్నారో దాని కంటే తక్కువే చేయగలుగుతున్నారట. ఎండలు భరించలేక మధ్యాహ్నం పూట చాలా ఇబ్బంది పడుతున్నారట. నెల రోజుల పాటు షెడ్యూల్‌ ప్లాన్‌ చేసినప్పటికీ అది అక్కడ పూర్తి చేస్తారో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పల్లెటూరి వాతావరణం కోసమని రాజమండ్రి వెళ్లిన వాళ్లే అదే రకమైన పచ్చని అందాలున్న చల్లని ప్రాంతాలు ఏమున్నాయని ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ని ఆరా తీస్తున్నారట. రాజమండ్రికి చల్లని ప్రత్యామ్నాయం ఏదైనా దొరికితే ఈ చిత్ర బృందం అక్కడికి షిఫ్ట్‌ అయిపోతుందని అంటున్నారు. తక్కువ సమయంలో చేసేద్దామని చూస్తోన్న చిత్రానికి ఆదిలోనే సూరీడు అడ్డు తగలడమేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు