ఎన్టీఆర్ ఫ్యాన్సా మజాకా!

ఎన్టీఆర్ ఫ్యాన్సా మజాకా!

చాలా ఏళ్ల పాటు సరైన హిట్టు లేక సతమతమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ టైంలో అతడి బాక్సాఫీస్ స్టామినా గురించే సందేహాలు వ్యక్తమయ్యాయి. మిగతా హీరోలు బిజినెస్.. కలెక్షన్లు.. టీజర్ వ్యూస్.. ట్విట్టర్ ట్రెండ్స్ విషయంలో రికార్డుల మోత మోగిస్తుంటే.. ఎన్టీఆర్ మాత్రం సినిమా సినిమాకూ వెనుకబడుతూ కనిపించాడు.

కానీ ‘టెంపర్’తో మాంచి సక్సెస్ అందుకున్నాక సీన్ మారిపోయింది. క్రమంగా క్రేజ్ పెరిగి.. ‘జనతా గ్యారేజ్’ సమయానికి పీక్స్‌కు చేరుకుంది. ఎన్టీఆర్ అభిమానులు రీ యూనియన్ అయి.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌కు తిరుగులేని స్థానం కల్పించారు. ‘జనతా గ్యారేజ్’కు సంబంధించి ప్రతి విశేషమూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఇప్పుడు ఎన్టీఆర్ 27వ సినిమా ‘జై లవ కుశ’ టైటిల్ లోగోను లాంచ్ చేయడం ఆలస్యం.. అది సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ట్విట్టర్లో ఈ టైటిల్ హ్యాష్ ట్యాగ్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుండటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా టాప్ ట్రెండ్స్‌లో ‘జై లవకుశ’ టాప్-50లో కొనసాగుతుండటం విశేషం. ఓ తెలుగు సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ వరల్డ్ వైడ్ 50వ స్థానంలో ట్రెండ్ అవడం అంటే చిన్న విషయం కాదు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి అదే నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. చెన్నై.. బెంగళూరు లాంటి నగరాల్లో ప్రస్తుతం టాప్-2లో కొనసాగుతోంది ‘జై లవ కుశ’ హ్యాష్ ట్యాగ్. సీనియర్ ఎన్టీఆర్ ‘లవకుశ’ను గుర్తుకు తెచ్చేలా ఉన్న ‘జై లవ కుశ’ టైటిల్ లోగో.. తారక్ అభిమానుల్నే కాదు.. సామాన్య ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు