మాస్ రాజా ట్విస్టిచ్చాడే...

మాస్ రాజా ట్విస్టిచ్చాడే...

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రాజా ది గ్రేట్'. ఇందులో హీరో అంధుడని.. టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ అదీ చూస్తేనే అర్థమైపోయింది. చిత్ర బృందం కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించింది. ఐతే షూటింగ్ ఆరంభమైన సందర్భంగా ట్విట్టర్లో తాజాగా రిలీజ్ చేసిన స్టిల్ చూస్తే మాస్ రాజా ఇందులో బ్లైండ్ క్యారెక్టరే చేస్తున్నాడా అని సందేహం కలుగుతోంది. ఇందులో రవితేజ స్పోర్ట్స్ పర్సన్ క్యారెక్టర్ చేస్తున్నట్లున్నాడు. ఫీల్డ్‌లో ఆట ముగిశాక తన టీంతో కలిసి ఫొటోలకు పోజిచ్చినట్లుగా కనిపిస్తోంది ఈ ఫొటో చూస్తుంటే. అతడి టీంలో ఆలీ, రఘు కారుమంచి కూడా ఉన్నారు. బహుశా హీరో ముందు క్రీడాకారుడిగా ఉండి ఆ తర్వాత కళ్లు కోల్పోతాడేమో ఈ చిత్రంలో.

ఇక నిన్న.. ఈ రోజు రిలీజ్ చేసిన రెండు ఫొటోల్లోనూ మాస్ రాజా లుక్ బాగుంది. అతను చివరగా నటించిన సినిమా 'బెంగాల్ టైగర్'లో అతడి లుక్ తేడాగా ఉండటం గమనించవచ్చు. అంతకుముందు రెండు మూడు సినిమాల్లోనూ రవితేజ కొంచెం తేడాగానే కనిపించాడు. 'కిక్' సినిమా టైంకి మరీ సన్నబడిపోయి చూడ్డానికి అదోలా కనిపించాడు రవితేజ. ఐతే 'బెంగాల్ టైగర్' తర్వాత ఏడాదికి పైగా విరామం తీసుకున్న మాస్ రాజా.. ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు.

'టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్ పోస్టర్లలోనే డిఫరెంటుగా కనిపించిన రవితేజ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' రెగ్యులర్ షూటింగ్ మొదలైన సందర్భంగా సరికొత్త లుక్ తో ఆకట్టుకున్నాడు. మధ్యలో ఏం చేశాడో ఏమో కానీ.. మాస్ రాజా వయసు కొంచెం తగ్గి ఒకప్పటి అందంతో కనిపిస్తున్నాడు. ముఖంలో చార్మ్ పెరిగింది. గడ్డం లుక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్టయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు