టాలీవుడ్‌ పై తాప్సి కొత్త ఆరోపణలు

టాలీవుడ్‌ పై తాప్సి కొత్త ఆరోపణలు

బాలీవుడ్ వెళ్లిపోయాక అదే పనిగా టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్న సొట్టబుగ్గల సుందరి తాప్సి.. మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. టాలీవుడ్ అని పర్టికులర్‌గా పేరు పెట్టకుండా.. ఒకప్పడు తాను చేసిన కొన్ని సినిమాలు ఫ్లాపయ్యాయని.. ఐతే ఆ ఫ్లాపుల్ని తన ఖాతాలోకి వేసి, పారితోషకం కూడా సరిగా ఇవ్వలేదని ఆమె ఆరోపించింది.

ఇంతకుముందు తెలుగులో తనకు అన్నీ గ్లామర్ రోల్సే ఇచ్చేవారని.. తన టాలెంట్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని.. స్టార్ హీరోలు, దర్శకులతో కలిసి చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే.. తన మీద ఐరెన్ లెగ్ ముద్ర వేసి.. తన వల్లే ఈ సినిమాలు పోయాయని ప్రచారం చేశారని తాప్సి మండిపడ్డ సంగతి తెలిసిందే.

తాజాగా తనకు పారితోషకాల్లోనూ కోత పడిన సంగతి ఆమె వెల్లడించింది. 'పింక్' సినిమా తర్వాతే తన ప్రతిభకు గుర్తింపు వచ్చి.. సరైన పారితోషకాలు ఇస్తున్నారని.. అంతకుముందు మాత్రం సినిమా ఫ్లాపైతే పారితోషకం ఇవ్వకపోవడం.. కోత వేయడం ఉండేదని తాప్సి వ్యాఖ్యానించింది. 'పింక్' కంటే ముందు ఆమె బాలీవుడ్లో ఎక్కువ సినిమాలేమీ చేయలేదు. అప్పటికి ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే కాబట్టి ఈ విమర్శలు ఇక్కడి సినిమాల్ని ఉద్దేశించే అని అర్థం చేసుకోవచ్చు.

'పింక్' తర్వాత బాలీవుడ్లో మంచి పేరు సంపాదించిన తాప్సి.. తాజాగా 'నామ్ షబానా'తోనూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రానికి టాక్ కొంచెం డివైడ్‌గా ఉన్నప్పటికీ తాప్సి పెర్ఫామెన్స్ మాత్రం అదుర్స్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English