చిరంజీవి రికార్డుని కొట్టేది మహేషే

చిరంజీవి రికార్డుని కొట్టేది మహేషే

'బాహుబలి' పూర్తిగా వేరే లీగ్‌లో వుండడంతో, రికార్డులకి ఆ చిత్రాన్ని మినహాయించి మిగతా చిత్రాలకి టార్గెట్‌ సెట్‌ చేస్తున్నారు. 'నాన్‌-బాహుబలి'గా చెప్పుకుంటోన్న ఈ రికార్డుని ముందుగా 'శ్రీమంతుడు'తో మహేష్‌ సెట్‌ చేసాడు. దానిని 'ఖైదీ నంబర్‌ 150'తో బిగ్‌ మార్జిన్‌తోనే క్రాస్‌ చేసాడు చిరంజీవి. బాహుబలి కాకుండా వంద కోట్ల షేర్‌ రాబట్టిన తెలుగు సినిమాగా ఈ చిత్రం రికార్డు సెట్‌ చేసింది.

అయితే అన్నయ్య పెట్టిన రికార్డుని తమ్ముడు రెండు నెలల్లోనే బీట్‌ చేసేస్తాడని కాటమరాయుడు గురించి అంచనా వేసారు కానీ అది తేడా కొట్టేసింది. పెట్టుబడినే రాబట్టుకోలేక రాయుడు చేతులెత్తేయడంతో ఇప్పుడు చిరు రికార్డుని బీట్‌ చేసే సినిమా ఏదంటూ చర్చ మొదలైంది. తదుపరి రాబోతున్న భారీ చిత్రాల్లో మహేష్‌23కి ఈ రికార్డు కొట్టే అవకాశాలు ఎక్కువ వున్నాయి.

మహేష్‌కి మురుగదాస్‌ జత కలవడంతో, అతడు మంచి కథకుడు ప్లస్‌ కమర్షియల్‌ సినిమాపై పట్టు బాగా వుండడంతో మిస్‌ఫైర్‌ అయ్యే అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు. వంద కోట్లకి పైగా పెట్టుబడితో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందే ఈ చిత్రం మూడు భాషల్లో విడుదలవుతుంది కనుక వంద కోట్ల షేర్‌ సాధించడం కష్టమేం కాదు. కాకపోతే కేవలం తెలుగులోనే వంద కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసి ఖైదీ నంబర్‌ 150ని బీట్‌ చేస్తుందా లేదా అని ఫాన్స్‌ ఎదురు చూస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో రాబోతున్న బాహుబలి యేతర చిత్రాల్లో ఆ రికార్డు కొట్టే పొటెన్షియల్‌ మాత్రం దీనికే వుందనేది ఒప్పుకుని తీరాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు