పవన్‌కళ్యాణ్‌ హీరోయిన్‌ ధగధగలు

పవన్‌కళ్యాణ్‌ హీరోయిన్‌ ధగధగలు

అను ఎమాన్యుయేల్‌ అనగానే ఆమె ఎవరనేది చాలా మందికి గుర్తు రాదు. సినిమాలు కీన్‌గా ఫాలో అయ్యే యువతరంలో కొంతమందికి తప్పిస్తే ఆమె ఇంకా గుర్తింపు పొందలేదు. మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రాల్లో నటించిన అను అతి తక్కువ కాలంలో ఏకంగా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి జంట కట్టేస్తోంది. అది కూడా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో రూపొందుతోన్న అత్యంత క్రేజీ చిత్రంలో.

కెరియర్‌ ఆరంభంలోనే ఇలాంటి గోల్డెన్‌ ఆపర్చునిటీ కొట్టేసినందుకు అను ఎమాన్యుయేల్‌ సంబర పడిపోతోంది. పవన్‌తో సినిమా చేసిన తర్వాత ఇక తనకి గుర్తింపు రాకుండా పోదు. ఇండస్ట్రీలో టాప్‌ స్టార్స్‌ అందరూ తన పేరు కన్సిడర్‌ చేయక మానరు. ఈ చిత్రంలో అవకాశం రావడంతో ఇక కొత్త సినిమాలు కూడా అను సైన్‌ చేయడం లేదు. దీని తర్వాత తన జాతకం మారిపోతుందని, రేంజ్‌ పెరిగిపోతుందని ఆమె సంబరంగా వుంది. నిన్ననే షూటింగ్‌ మొదలైన ఈ చిత్రానికి ముందుగా పవన్‌, అనులపై సీన్లనే త్రివిక్రమ్‌ చిత్రీకరిస్తున్నాడు.

ఈ చిత్రం షూటింగ్‌ స్పాట్లోనుంచి తన ఫోటో పెట్టి ఇందులో తాను ఎలా కనిపించబోతున్నా అనేది అను చెప్పకనే చెప్పింది. కళకళలాడిపోతున్న అను ఎమాన్యుయేల్‌ ముందు ముందు అంతా ఎక్సయిటింగ్‌గా వుంటుందని పరవశంగా చెబుతోంది. మరి పవన్‌కళ్యాణ్‌తో ఛాన్స్‌ అంటే మాటలు కాదుగా మరి. అందులోను తనలాంటి యంగ్‌ హీరోయిన్‌కి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు