ఆ హీరోయిన్‌కి తెగ సోపేస్తోన్న హీరో

ఆ హీరోయిన్‌కి తెగ సోపేస్తోన్న హీరో

ఆ హీరోయిన్‌తో అతను ఇప్పటికే రెండు హిట్‌ సినిమాల్లో నటించాడు. మరో చిత్రం కూడా వీరి కాంబినేషన్‌లో రూపొందుతోంది. సదరు హీరోయిన్‌తో అతనికి సాన్నిహిత్యం బాగానే వుందనే గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. అయితే ఆ హీరోయిన్‌కి ఇండస్ట్రీలో చాలా మంది యువ హీరోలు మంచి స్నేహితులట. యంగ్‌ గ్యాంగ్‌ అందరితోను ఆమె సన్నిహితంగానే వుండడంతో ఇతగాడు కాంపిటీషన్‌ ఫీలవుతున్నాడట.

ఎలాగైనా తనకి స్పెషల్‌ అయిపోవడానికి చాలా ట్రై చేస్తున్నాడట. తనతో కొత్త సినిమా సైన్‌ చేయడానికి వచ్చిన వాళ్లతో ఆ హీరోయిన్‌ని తీసుకోండంటూ సిఫార్సు చేస్తున్నాడట. ఆమె ఏం చేసినా కానీ అదేదో గొప్ప విషయమన్నట్టు తెగ పొగిడేయడం, ఆమె చిన్న జోక్‌ వేసినా కానీ పగలబడి నవ్వేయడం... ఇలా ఆమెని ఇంప్రెస్‌ చేయడానికి అతను చేయని ప్రయత్నమంటూ లేదట.

తనకి ఆఫర్లు తెచ్చి పెడుతున్నాడని, తనపై ఆసక్తి చూపిస్తున్నాడని తెలిసినా కానీ ఆమె అతడిని మరీ ప్రత్యేకంగా చూడడం లేదట. కెరియర్‌ ఆరంభంలోనే పర్సనల్‌ ఇంట్రెస్టులు చూపిస్తే ముందుకి వెళ్లలేననే లౌక్యం తెలిసినదే కావడంతో ఆమె అతడి వ్యవహారాన్ని ఎక్కువ సీరియస్‌గా తీసుకోవడం లేదని భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు