అల్లు అర్జున్‌ కోసం ఫ్రెష్‌ అందాలు

అల్లు అర్జున్‌ కోసం ఫ్రెష్‌ అందాలు

హీరోయిన్ల కొరత బాగా వుండడంతో ఈమధ్య దర్శక, నిర్మాతలు వేరే భాషల నుంచి హీరోయిన్లని తీసుకొస్తున్నారు. ఆల్రెడీ వున్న టాప్‌ హీరోయిన్లు అందరు హీరోలతో నటించేయడం వల్ల ఫ్రెష్‌ కాంబినేషన్ల కోసం దర్శకులు ప్రయత్నిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ సరసన యువ హీరోయిన్లు కీర్తి సురేష్‌, అను ఎమాన్యుయేల్‌ని త్రివిక్రమ్‌ తీసుకున్నాడంటే అదే కారణం.

గతంలో ప్రతి సినిమాలో కొత్త హీరోయిన్‌ని పరిచయం చేసిన అల్లు అర్జున్‌ తర్వాత స్టార్‌ హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్నాడు. మాస్‌కి సినిమా రీచ్‌ అవడానికి పేరున్న హీరోయిన్లే బెటర్‌ అని బన్నీ ఫీలయ్యాడు. అయితే తన కొత్త సినిమాకి మాత్రం ఆల్రెడీ వున్న హీరోయిన్‌ కాకుండా మనకి తెలియని ఒక కొత్త అందాన్ని పరిచయం చేయాలని చూస్తున్నారు.

కిరిక్‌ పార్టీ అనే కన్నడ చిత్రంతో కర్నాటకలో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయిన హీరోయిన్‌ రష్మిక మందానని అల్లు అర్జున్‌ తదుపరి చిత్రంలో తెలుగు సీమకి పరిచయం చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ నటించే చిత్రంలో రష్మిక ఎంపికైనట్టు సమాచారం. కర్నాటక నుంచి తెలుగు చిత్ర సీమకి వచ్చిన వాళ్లలో సౌందర్య, అనుష్కలాంటి వాళ్లు టాప్‌ హీరోయిన్లయ్యారు కనుక రష్మిక కూడా వారి బాటలో స్టార్‌ అయిపోయినా ఆశ్చర్యం లేదు. అసలే మొదటి సినిమాలోనే సూపర్‌ ఫామ్‌లో వున్న స్టయిలిష్‌ స్టార్‌తో ఛాన్స్‌ కొట్టేసిందిగా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు