100 రోజులైనా ఘాటు తగ్గలేదు

100 రోజులైనా ఘాటు తగ్గలేదు

చాలా సినిమాలు ఈ మధ్య కేవలం రికార్డులు సాధించాయా లేదా అనే చూసుకుంటున్నాయ్‌ కాని, ఒకప్పుడు లాగా ఎన్నిరోజులపాటు ఎన్ని సెంటర్లలో ఆడాయి అనే విషయం ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. ఇప్పుడు కేవలం మొదటి వారంలో ఎంత, రెండవ వారంలో ఎంత అనేదే ముఖ్యం. ఇటు నిర్మాతలు, అటు హీరోలు కూడా దానినే చూస్తున్నారు.

అయితే ఎటువంటి చడీచప్పుడు లేకుండా వచ్చిన రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'మిర్చి' మాత్రం దానిని ఘాటు రేంజేంటో సూపర్బ్‌గా చూపించింది. అన్ని చోట్లా కెలక్షన్ల దంచిపాడేయటమే కాదు, ఏకంగా 28 సెంటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది. ఇప్పటికే సినిమా సాయంత్రం ఆటలు హౌస్‌ ఫుల్‌ అవుతున్నాంటే మనోడి ఘాటేంటో చెప్పొచ్చు. కేవలం కథలో సత్తా, కథనంలో బలం, టేకింగ్‌లో దమ్ము ఉండటం వలనే ఈ రేంజ్‌ హిట్టయిందంటున్నారు నిర్మాతలు.

టాలీవుడ్‌లో చాలా రోజుల తరువాత ఇలా ఒక సినిమా వంద రోజులు ఆడింది కాబట్టి, ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్‌ చేద్దామని చూస్తున్నారట అభిమానులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు