హంసానందిని స్పీడ్ అందుకేన‌ట‌..!

హంసానందిని స్పీడ్ అందుకేన‌ట‌..!

వంక పెట్ట‌టానికి వీల్లేని అందం ఉన్నా.. కొంద‌రికి అవ‌కాశాలు అంత‌గా రావు. అలాంటి వారిని చూసిన‌ప్పుడు.. అందం ఉండ‌గానే స‌రిపోదు.. అదృష్టం కూడా ఉండాల‌న్న భావ‌న క‌చ్ఛితంగా క‌లుగుతుంది. అందాలు పుష్క‌లంగా ఉన్నా.. అవ‌కాశాలు ఏ మాత్రం ల‌భించ‌ని బ్యాచ్‌లో హంసానందిని ఉంటారు. అప్పుడ‌ప్పుడు వ‌చ్చే చిన్న చిన్న అవ‌కాశాల్ని వినియోగించుకుంటూ తెర మీద త‌ళుక్కుమ‌న్నా.. పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌ని ప‌రిస్థితి. చివ‌ర‌కు ప్ర‌త్యేక గీతాల్లో త‌ళుక్కుమ‌న్నా.. ఆమెకు అవ‌కాశాలు అంతంత‌మాత్ర‌మే.

అయితే.. అదంతా ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు ప‌రిస్థితి మొత్తం మారింది. ఇప్పుడు ఆమె ఒక్క‌సారిగా బిజీ అయిపోయింది. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా వ‌స్తున్న అవ‌కాశాల‌తో ఆమె బిజీబిజీగా మారింది. స్టార్ హీరోలు న‌టిస్తున్న ప‌లు సినిమాల్లో ఛాన్స్‌ల్ని ద‌క్కించుకుంటోంది. హంస ఇంత స్పీడ్ ఎలా? అన్న క్వ‌శ్చ‌న్‌కు స‌మాధానం వెతికితే.. అమ్మ‌డి హ‌డావుడి వెన‌క‌.. ఒక ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

అత‌డు ఎప్ప‌టి నుంచైతే.. హంస డేట్లు.. ఫైనాన్స్ మ్యాట‌ర్స్ చూడ‌టం మొద‌లు పెట్టాడో.. ఆమె తీరే మారిపోయింద‌ని చెబుతున్నారు. ఇంత‌కీ.. ఎవ‌రా మేనేజ‌ర్ అంటే మాత్రం.. ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు రానీయ‌టం లేదు. ఎంత గుట్టు అయినా.. ఏదో ఒక‌రోజు ర‌ట్టు కాకుండా ఉంటుందా ఏంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు