ఎయిర్‌పోర్ట్‌లో కాలకేయుడికి ఏమి జరిగిందంటే

ఎయిర్‌పోర్ట్‌లో  కాలకేయుడికి ఏమి జరిగిందంటే

నటుడు ప్రభాకర్ అంటే జనాలు గుర్తు పట్టకపోవచ్చు కానీ.. కాలకేయ ప్రభాకర్ అంటే మాత్రం పరిచయాలు అక్కర్లేదు. ఈ పాత్రతో మామూలు గుర్తింపు సంపాదించలేదు ప్రభాకర్. దీని కంటే ముందు ‘మర్యాద రామన్న’లో బైర్రెడ్డి పాత్రతో ప్రభాకర్‌కు నటుడిగా లైఫ్ ఇచ్చింది కూడా రాజమౌళే.

అందుకే ఆయన పేరెత్తగానే చాలా ఎమోషనల్ అయిపోతుంటాడు ప్రభాకర్. రాజమౌళి మీద అభిమానంతో తన పెద్ద కొడుక్కి ఆయన పేరు కూడా పెట్టుకున్నాడట ప్రభాకర్. ఇక ఊరూ పేరూ లేని తనకు రాజమౌళి సినిమాల వల్ల వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ అయ్యాడు ప్రభాకర్.

‘‘నటన అంటే ఏంటో తెలియని నాకు ‘మర్యాద రామన్న’ లాంటి సినిమాలో కీలకమైన పాత్ర ఇచ్చి నాకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టారు రాజమౌళి గారు. ఇక కాలకేయ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చిపెట్టారు. ఉత్తరాదిన కూడా నాకు గుర్తింపు వచ్చింది. ఎక్కడికెళ్లినా నన్ను ప్రభాకర్ అని పిలవట్లేదు. కాలకేయ వచ్చాడు అంటున్నారు.

ఓ రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పాస్ పోర్ట్ టైం అయిపోయింది.. అనుమతించమని చెప్పారు. ఐతే నేను సినిమా నటుడినని.. బాహుబలి సినిమాలో కాలకేయుడిగా నటించింది నేనేనని యూట్యూబ్ వీడియో తీసి చూపించాను. వెంటనే అధికారులు నన్ను అనుమతించారు. ఐతే నా ఫేవరెట్ క్యారెక్టర్ ఏదంటే మాత్రం కాలకేయ కాదు ‘మర్యాద రామన్న’లోని బైర్రెడ్డి పాత్రే అంటాను. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. ఆ సినిమాతో నా జీవితాన్ని మలుపు తిప్పారు రాజమౌళి. అందుకే ఆయన.. ఆయన భార్య రమ పేర్లు కలిసొచ్చేలా నా పెద్ద కొడుక్కి శ్రీరాం రాజమౌళి అని పేరు పెట్టుకున్నా’’ అని ప్రభాకర్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు