ర‌త్తాలు ఫీల‌వుతుంది.. ఆమె మాట‌ను వినండి బాస్‌

ర‌త్తాలు ఫీల‌వుతుంది.. ఆమె మాట‌ను వినండి బాస్‌

అందాలు పుష్క‌లంగా ఉన్నా.. కొంత‌మందికి కాలం ఎంత‌మాత్రం క‌లిసి రాదు. ఎక్క‌డ ఎంతెంత అందాలు ఉండాలో అంత‌కంటే పిస‌రు ఎక్కువ ఉన్న‌ప్ప‌టికీ.. అవ‌కాశాలు రాని వారిలో రాయ్ ల‌క్ష్మి ఒక‌రు. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎలాంటి అడ్డు చెప్ప‌ని ఈ బెంగ‌ళూరు పాప‌కు.. అర‌కొర వేషాలు.. ప్ర‌త్యేక గీతాల్లో న‌టించే ఛాన్స్ లే త‌ప్పించి.. మంచి అవ‌కాశం ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చింది లేద‌ని తెగ ఫీల్ అవుతోంది.

అంద‌రూ అనుకునేంత పెద్ద‌దాన్ని కాద‌ని.. తాను చాలా చిన్న‌దాన్న‌ని చెబుతోంది. త‌న‌ను చూసినోళ్లంతా థ‌ర్టీ అనుకుంటార‌ని.. కానీ.. త‌న వ‌య‌సు మాత్రం జ‌స్ట్ 26 మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చింది. తాను ప‌దిహేనేళ్ల వ‌య‌సులోనే తొలి మూవీ చేశాన‌ని.. అందుకే.. త‌న‌ను చూసినోళ్లంతా త‌న‌కు 30 ఏళ్లు దాటాయ‌ని అనుకుంటార‌ని.. కానీ అది నిజం కాదంది.

కొంద‌రిని చూసిన వెంట‌నే కొన్ని అభిప్రాయాలు క‌లుగుతుంటాయ‌ని.. అలా అనిపించేవ‌న్నీ నిజాలు ఎంత‌మాత్రం కాద‌ని చెబుతోంది. అందుకు త‌న ఏజ్ ను ఎగ్జాంపుల్ గా చెబుతోంది. తాను ముదురు కాన‌ని.. చాలా చిన్న‌దాన్నేన‌ని.. త‌న‌కూ అవ‌కాశాలు ఇవ్వొచ్చ‌న‌ట్లుగా రాయ్ ల‌క్ష్మి మాట‌ల్లేవు. మెగాస్టార్ 150 చిత్ర‌మైన ఖైదీ 150లో ర‌త్తాలు పాట‌లో త‌న అందాల‌తో మ‌త్తెక్కించిన రాయ్ ల‌క్ష్మి ఆవేద‌న‌ను అర్థం చేసుకుంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు