మిస్టర్‌కి పర్‌ఫెక్ట్‌ స్టేజ్‌ సెట్‌

మిస్టర్‌కి పర్‌ఫెక్ట్‌ స్టేజ్‌ సెట్‌

క్యాష్‌ చేసుకోవాలే కానీ 'మిస్టర్‌' చిత్రానికి గ్రాండ్‌ స్టేజ్‌ సెట్‌ అయింది. ఈ శుక్రవారం 'చెలియా' తప్ప స్ట్రెయిట్‌ సినిమాలేవీ విడుదల కావడం లేదు. మరో పది రోజులకి 'గురు' జోరు తగ్గిపోవడంతో పాటు 'కాటమరాయుడు' పూర్తిగా థియేటర్లనుంచి వెళ్లిపోతుంది.

అంటే ఏప్రిల్‌ 13న మిస్టర్‌ వచ్చేసరికి గ్రౌండ్‌ మొత్తం క్లియర్‌గా వుంటుందన్నమాట. కాటమరాయుడు ఫెయిల్‌ అవడంతో సమ్మర్‌లో పూర్తి స్థాయి వినోదాత్మక కుటుంబ కథాచిత్రంగా ముందు వచ్చేది ఇదే అవుతుంది. సమ్మర్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకి బాగా వస్తారు కనుక 'మిస్టర్‌' కానీ మంచి టాక్‌ తెచ్చుకున్నట్టయితే 'బాహుబలి' వచ్చేవరకు దానికి ఎదురే వుండదు.

బాహుబలి ఏప్రిల్‌ 28న ఫిక్స్‌ అవడంతో ఆ ముందు వారంలో చెప్పుకోతగ్గ సినిమాలేవీ రావడం లేదు. అంటే మిస్టర్‌కి బాహుబలి వచ్చేలోగా రెండు వారాల పాటు ఫ్రీ స్పేస్‌ వుంటుంది. అలాగే బాహుబలి రిలీజ్‌ అయిన తర్వాత కూడా సెకండ్‌ ఆప్షన్‌గా మార్కెట్లో ఈ ఒక్క సినిమానే వుంటుంది.

భారీ హిట్‌ కోసం చూస్తోన్న హీరోకి ఇంతకంటే మంచి ముహూర్తం కుదరదు. మరి ఈసారైనా వరుణ్‌తేజ్‌కి అదృష్టం కలిసి వస్తుందో లేదో అనేది పది రోజుల్లో తేలిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు