చిన్న సినిమాలపై ఫోకస్ పెట్టాడు

చిన్న సినిమాలపై ఫోకస్ పెట్టాడు

గుండె జారి గల్లంతయ్యిందే లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీతో దర్శకుడిగా టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్ కుమార్ కొండా. దాని తర్వాత అతను తీసిన ‘ఒక లైలా కోసం’ జస్ట్ యావరేజ్ అనిపించుకుంది.

ఈ సినిమా విడుదలై రెండున్నరేళ్లు దాటింది. కానీ ఇప్పటిదాకా విజయ్ తన తర్వాతి సినిమా సంగతేంటో తేల్చలేదు. మధ్యలో తన తొలి సినిమా హీరో నితిన్ తో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సీక్వెల్ చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి కానీ.. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మధ్యలో పెళ్లి గొడవతో వార్తల్లో నిలిచాడు విజయ్ కుమార్. ఆ గొడవ కాస్త సద్దుమణిగాక.. ఇప్పుడు తన తర్వాతి సినిమా మీద దృష్టిసారీంచాడీ యువ దర్శకుడు.

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండా తన తర్వాతి సినిమాను రూపొందించబోతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ఈ చిత్రాన్ని నిర్మించబోతోందట. ఇటీవలే ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’తో సక్సెస్ అందుకున్నాడు రాజ్ తరుణ్. దీని తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్ బేనర్లోనే వరుసగా మూడో సినిమా అయిన ‘అంధగాడు’ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

విజయ్ చెప్పిన కథ రాజ్ కు నచ్చడం.. పీవీపీ వాళ్లు కూడా ఈ స్క్రిప్టును ఓకే చేయడంతో త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఒకప్పుడు వరుసగా భారీ సినిమాలే చేసి గట్టి ఎదురు దెబ్బలు తిన్న పీవీపీ.. ఈ మధ్య చిన్న సినిమాలపై ఫోకస్ పెట్టాడు. గత ఏడాది ‘క్షణం’ ఆయనకు మంచి ఫలితాన్నిచ్చింది. ‘రాజుగారి గది’ కూడా మీడియం రేంజి సినిమానే. రాజ్ తరుణ్-విజయ్ సినిమాను కూడా తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English