ఇండియన్ ఐడల్.. ఇతనైనా నిలబడతాడా?

ఇండియన్ ఐడల్.. ఇతనైనా నిలబడతాడా?

ఒకప్పుడు ఇండియన్ ఐడల్ పోటీ అనగానే అదేదో ఉత్తరాది వాళ్లకు చెందిన పోటీ అని మనవాళ్లు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ హేమచంద్ర.. కారుణ్య లాంటి మన గాయకులు.. ఆ షోలో అదరగొట్టి టైటిల్ కు చేరువగా వెళ్లి మనవాళ్లూ నేషనల్ లెవెల్లో అదరగొట్టగలరని రుజువు చేశారు.

వీళ్లి స్ఫూర్తితో శ్రీరామచంద్ర 2010లో ఇండియల్ ఐడల్ టైటిల్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. తీవ్ర పోటీ మధ్య సత్తా చాటుకుని.. తొలిసారి ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన తెలుగు గాయకుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు మళ్లీ ఏడేళ్ల విరామం తర్వాత మరో తెలుగు కుర్రాడు ఆ టైటిల్ తో సత్తా చాటాడు. అతనే రేవంత్.

ఇప్పటికే తెలుగులో గాయకుడిగా మంచి పేరు సంపాదించి.. ఇండియన్ ఐడల్ తాజా సీజన్లో అద్భుతమైన పాటలతో అందరినీ మెప్పించిన రేవంత్.. చివరికి టైటిల్ కూడా సొంతం చేసుకున్నాడు. మరో తెలుగు సింగర్ రోహిత్ ఈ పోటీలో సెకండ్ రన్నరప్ గా నిలవడం విశేషం. ఉత్తరాది సింగర్ ఖుదా భక్ష్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచాడు.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా రేవంత్ విన్నర్ ట్రోఫీని అందుకోవడం విశేషం. అతడికి రూ.25 లక్షల ప్రైజ్ మనీతో పాటుగా సోనీ మ్యూజిక్ సంస్థతో కాంట్రాక్టు కూడా దక్కింది. ఆ సంస్థతో అతను ఆల్బమ్స్ చేస్తాడు. రేవంత్ శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి గాయకుడిగా ఒక్కో మెట్టు ఎదిగి.. తెలుగు సినిమాల్లో పాటలు పాడాడు.

అతను ‘బాహుబలి’లో మనోహరి పాటను ఆలపించడం విశేషం. ఐతే ఇండియన్ ఐడల్ పోటీలో గెలిచిన వాళ్లకు సింగర్ గా అంత మంచి ఫ్యూచర్ ఉండదన్న సెంటిమెంటు ఒకటుంది. ఇందుకు శ్రీరామచంద్రతో పాటు చాలామంది ఉదాహరణలుగా కనిపిస్తారు. మరి రేవంత్ ఆ సెంటిమెంటును బ్రేక్ చేసి.. సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతాడేమో చూద్దాం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English