బాహుబలి 2లో అరగంట పాటు వారిద్దరి సీన్లేనట

బాహుబలి 2లో అరగంట పాటు వారిద్దరి సీన్లేనట

ఎప్పుడా..మరెప్పుడా అన్నట్లుగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవైటింగ్ బాహుబలి2కు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న రహస్యం మరో 26 రోజుల్లో (ఇవాల్టి రోజును తీసేస్తే) రివీల్ కానున్న వేళ.. ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన విషయం బయటకు వచ్చింది. తన సినిమాకు సంబంధించిన విషయాల్ని బయటపెట్టేందుకు దర్శకుడు రాజమౌళి పెద్దగా ఇష్టపడరు. సినిమా ఎలా ఉంటుంది?లాంటి అంశాలపై జనరలైజ్ చేసి మాట్లాడే అలవాటున్నజక్కన్న. . బాహుబలి 2కి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించటం గమనార్హం.

బాహుబలి2లో రమ్యకృష్ణ పోషించిన శివగామి క్యారెక్టర్.. అనుష్క పోషించిన దేవసేన పాత్రల మీద చాలానే అంచనాలున్నాయి.మొదటి పార్ట్ తోపోలిస్తే.. రెండో పార్ట్ లో వారికి అమితమైన ప్రాదాన్యత ఉంది. రెండో పార్ట్ సుమారు 2.30 గంటలు ఉండే అవకాశం ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. ఇందులో దాదాపు అరగంట వరకూ దేవసేన.. శివగామి పాత్రల మధ్య జరిగే సన్నివేశాలే ఉంటాయన్నవిషయన్నిబయటపెట్టారు రాజమౌళి.

అమరేంద్ర బాహుబలి సవతితల్లి పాత్రను పోషించారు శివగామి. ఇక బాహుబలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది దేవసేన. సినిమాలో కీలకమైన అరగంట ఈ రెండు పాత్రల మధ్య సన్నివేశాలే ఉంటాయంటే.. బాహుబలి.. దేవసేన లవ్ ట్రాక్ తక్కువలో తక్కువ 15 నిమిషాలు ఉండేఅవకాశం ఉంది. అంటే.. మొత్తం సినిమాలో దాదాపు 45 నిమిషాలు బాహుబలి – అనుష్కల లవ్ ట్రాక్.. మరో అరగంట శివగామి..దేవ సేన క్యారెక్టర్ల మధ్య సీన్లు ఉంటాయన్నది తాజాగా బయటకు వచ్చిన విషయం. మరి.. 150 నిమిషాల నిడివి ఉంటుందనుకుంటే.. అందులో 45 నిమిషాలు ఇవే సన్నివేశాలంటే.. బాహుబలి2 ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు