'లేడీస్‌ టైలర్‌' పై ఫైర్‌ అయిన మంచు లక్ష్మి

 'లేడీస్‌ టైలర్‌' పై ఫైర్‌ అయిన మంచు లక్ష్మి

'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' అంటూ సీనియర్‌ దర్శకుడు వంశీ తాను ఎనభైలలో తీసిన 'లేడీస్‌ టైలర్‌' చిత్రానికి సీక్వెల్‌ తీస్తున్నాడు. మధుర శ్రీధర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ కంటే ముందుగా ప్రీ లుక్‌ అంటూ ముఖాలు కనిపించని ఒక పోస్టర్‌ రిలీజ్‌ చేసారు. అమ్మాయి జాకెట్‌ కొలతలు తీసుకుంటోన్న టైలర్‌ ఫోటోతో ఎలాంటి సంచలనం చేయాలనుకున్నారనేది తెలుస్తూనే వుంది. ఈ పోస్టర్‌ త్వరగానే ఫెమినిస్టుల దృష్టిలో పడింది.

మంచు లక్ష్మి ఈ పోస్టర్‌ని చూపిస్తూ ఎన్నాళ్లు ఆడవాళ్లని ఇలా హీనంగా చూపిస్తారంటూ కోప్పడింది. దాంతో వెంటనే నిర్మాత మధుర శ్రీధర్‌ స్పందించి తమ ఉద్దేశం ఎవరినీ కించ పరచాలని కాదని, కేవలం సినిమాలోని ఒక సీన్‌ని ప్రీ లుక్‌గా వాడుకున్నామని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చుకున్నాడు. అయితే మంచు లక్ష్మి కోప్పడడం వల్ల ఈ చిత్రానికి అదనపు పబ్లిసిటీ వచ్చినట్టయింది.

ఈ పోస్టర్‌ని మామూలుగా పట్టించుకోని వాళ్లు కూడా ఏమి చేసారా అని ఆసక్తిగా చూస్తున్నారు. లేడీస్‌ టైలర్‌ అప్పట్లోనే ఒక స్థాయి అడల్ట్‌ కామెడీ. మరి అడల్ట్‌ కామెడీలు ముదురుతోన్న ఈ రోజుల్లో వంశీ నుంచి ఇంకెంతటి సంచలనాత్మక 'జమ జచ్చ' వస్తుందనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English