ప్రభాస్ నిశ్చితార్థం చేసుకున్నాడు!

ప్రభాస్ నిశ్చితార్థం చేసుకున్నాడు!

అవునా? ప్రభాస్ పెళ్లి నిశ్చయమైందా? ఎవరితో? ఎప్పుడు? ఒకేసారి ఇన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి కదూ. నిజమే మరి. బాహుబలుడి పెళ్లి అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు. ప్రభాస్ పెళ్లి నిశ్చయమైన మాట వాస్తవమే. ఆయన నిశ్చితార్థం తంతు పూర్తి చేసుకున్న మాట కూడా వాస్తవమే. అయితే ఇదంతా నిజ జీవితంలోని నిశ్చితార్థం కాదు. తెరపైన కనిపించనున్న సందడి మాత్రమే. 

ప్రస్తుతం ప్రభాస్ `బాహుబలి` సినిమాలో నటిస్తున్నాడు. అందులో నిశ్చితార్థం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. వాటిని ప్రభాస్, అనుష్కలపై ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కించారు. దర్శకుడు రాజమౌళి ప్రతీ ఫ్రేం ని ఎంతో అందంగా, అద్భుతంగా తెరకెక్కించాడట. రెండు కోట్ల వ్యయంతో వేసిన భారీ సెట్స్ లో ఈ సన్నివేశాలను షూట్ చేసినట్టు సమాచారం. శతాబ్దాల నాటి కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. 150 కోట్ల వ్యయంతో తెరకెక్కుతోందని సమాచారం. ఇందులో రానా, అడివి శేష్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English